Asianet News TeluguAsianet News Telugu

షెడ్లోకెళ్లిన నాలుగు జలాంతర్గములు: చైనా వైపు పాక్ చూపు

పాకిస్తాన్ నావికా దళానికి పెద్ద సమస్య వచ్చి పడింది. నౌకా దళంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐదు జలాంతర్గముల్లో నాలుగు జలాంతర్గములు మూలన పడ్డాయి. 

4 Pakistan navy Submarines undergoing major repairs
Author
Islamabad, First Published Apr 1, 2019, 4:57 PM IST

పాకిస్తాన్ నావికా దళానికి పెద్ద సమస్య వచ్చి పడింది. నౌకా దళంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐదు జలాంతర్గముల్లో నాలుగు జలాంతర్గములు మూలన పడ్డాయి. దీంతో దాయాది దేశం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

దీంతో వాటికి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పుల్వామా దాడుల తర్వాత పాక్ తన సముద్ర తీరాన్ని కాపాడుకునేందుకు చైనా సాయం కోరినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా దాడికి ప్రతీకారంగా అదే నెల 26న భారత్ పాక్‌లోని జైషే స్థావరాలపై భారత్ సర్జికల్  స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆ మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడికి యత్నించాయి.

దీనిని భారత్ ధీటుగా తిప్పికొట్టింది. అదేరోజు సాయంత్రం భారత పశ్చిమ తీరంలోని అంతర్జాతీయ జలాల్లో పాక్ నేవికి చెందిన జలంతర్గామి సంచరించింది. ఇది కేవలం భారత దృష్టిని మరల్చేందుకేనని రక్షణ రంగ నిపుణులు తేల్చారు. అయితే ఆ కొద్దిసేపటికే అది తిరిగి వెనక్కి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios