Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక మారణ హోమం: 290కి చేరిన మృతులు, ఐదుగురు భారతీయులు

 శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం నాడు చోటు చేసుకొన్న 8 వరుస పేలుళ్ల ఘటనలో  సుమారు 290 మంది మృత్యువాత పడ్డారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఐదుగురు భారతీయులు కూడ ఉన్నారు.
 

290 Including 5 Indians Killed In Sri Lanka Serial Blasts, 24 Arrested
Author
Colombo, First Published Apr 22, 2019, 10:37 AM IST


కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం నాడు చోటు చేసుకొన్న 8 వరుస పేలుళ్ల ఘటనలో  సుమారు 290 మంది మృత్యువాత పడ్డారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఐదుగురు భారతీయులు కూడ ఉన్నారు.

ఆదివారం నాడు ఈస్టర్‌‌ను పురస్కరించుకొని చర్చిలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని 8 చోట్ల ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు.  మృతి చెందిన భారతీయుల్లో   జి. హనుమంతరాయప్ప,  ఎం. రంగప్ప‌లను గుర్తించినట్టుగా భారతీయ ఎంబసీ అధికారులు ప్రకటించారు.  వీరిద్దరితో పాటుగా  లక్ష్మి నారాయణ చంద్రశేఖర్, రమేష్‌లు ఉన్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.

శ్రీలంకలో ఉన్న భారత హై కమిషనర్‌ ఈ మేరకు ఐదుగురు మృత్యువాతపడిన విషయాన్ని గుర్తించినట్టుగా  సుష్మాస్వరాజ్ ట్వీట్ చేసింది.శ్రీలంక అధికారులతో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంక అధికారులతో మాట్లాడారు. 

కేరళ రాష్ట్రానికి చెందిన పిఎస్ రసినా పేరును కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అయితే  రసినా విషయమై శ్రీలంకలో ఉన్న భారత హై కమిషనర్‌ కార్యాలయం మాత్రం ధృవీకరించలేదు.యూకే, యూఎస్‌, నెదర్లాండ్స్‌ దేశాలకు చెందిన వారు మృత్యువాత పడినట్టుగా శ్రీలంక అధికారులు చెబుతున్నారు.

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన 24 మందిని శ్రీలంక పోలీసులు  అరెస్ట్ చేశారు.  అయితే ఈ ఘటనకు పాల్పడిన వారి వివరాలను విడుదల చేయలేదు.దక్షిణ కొలంబోలోని పండురలో మూడు మాసాలుగా ఉగ్రవాదులు తలదాచుకొన్నారని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

Follow Us:
Download App:
  • android
  • ios