Asianet News TeluguAsianet News Telugu

అలాంటి లోదుస్తులు వేసుకుంటే శృంగారానికి ఒకే చేసినట్టా..?

అమ్మాయిలు ఎలాంటి అండర్ వేర్స్ వేసుకోవాలో కూడా మీరే చేస్తారా అంటూ.. ఐర్లాండ్ లో మహిళలు మండిపడుతున్నారు. 

#ThisIsNotConsent: Protests In Ireland After Thong Underwear Cited In Rape Trial
Author
Hyderabad, First Published Nov 17, 2018, 2:50 PM IST

అమ్మాయిలు ఎలాంటి అండర్ వేర్స్ వేసుకోవాలో కూడా మీరే చెప్తారా అంటూ.. ఐర్లాండ్ లో మహిళలు మండిపడుతున్నారు. ఓ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. ఐర్లాండ్ లో అమ్మాయిలు  ఉద్యమం చేస్తున్నారు. ThisIsNotConsent అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో అండర్‌వేర్‌ ఫొటోలను షేర్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... కొద్ది రోజుల క్రితం కార్క్ అనే పట్టణంలో 17 ఏళ్ల బాలికపై 27 వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంరతం కోర్టులో హాజరుపర్చారు. కాగా కేసు విచారించిన కోర్టు, నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో మహిళలు వేసుకునే అండర్‌వేర్‌ను చూపిస్తూ.. ‘ఈ అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుందో చూడండి. ఇలాంటి దుస్తులతోనే ఆమె అతన్ని అకర్షించే ప్రయత్నం చేసింది’ అని ఢిఫెన్స్‌ లాయ‌ర్ వాదించాడు. దీనిపై భగ్గుమన్న మహిళలు ‘ఎలాంటి అండర్ వేర్ వేసుకుంటే ఏంటీ..? అలాంటి అండర్ వేర్ వేసుకుంటే శృంగారానికి అంగీకరించినట్టా..? అని  ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసులో న్యాయస్థానం దోషికి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తూ.. మహిళలు తమ అండర్ వేర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios