Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!

ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది

ICC Announces ODI rankings after world cup 2019
Author
Dubai - United Arab Emirates, First Published Jul 16, 2019, 2:33 PM IST

ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో... 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్ 774 పాయింట్లతో అతను పదో స్థానంలో నిలిచాడు.

ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను గెలిపించిన బెన్‌స్టోక్స్‌ 694 పాయింట్లతో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. 809 పాయింట్లతో యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఇంగ్లీష్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఏడో స్థానంలో.. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ పదో స్థానంలో నిలిచాడు.

ఇక టోర్నీలో 20 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లాండ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్చర్ టాప్-30లో చోటు సంపాదించాడు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ అగ్రస్థానంలో నిలవగా... బెన్‌స్టోక్స్ రెండో స్థానంలో నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios