Asianet News TeluguAsianet News Telugu

రెయిన్ ఎఫెక్ట్: కేటీఆర్ చేతుల మీదుగా ఎమర్జెన్సీ టూ వీలర్ ఫోర్స్

విపత్తు సమయాల్లో త్వరితగతిన చేరుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని చాలామటుకు తగ్గించవచ్చని మంత్రి కేటీర్ అన్నారు. విపత్తు రక్షణ దళాలకు చెందిన అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రారంభిస్తూ మంత్రి కేటీర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

KTR launches two wheeler of disaster management force
Author
Hyderabad, First Published Sep 28, 2019, 6:03 PM IST

హైదరాబాద్: విపత్తు సమయాల్లో త్వరితగతిన చేరుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని చాలామటుకు తగ్గించవచ్చని మంత్రి కేటీర్ అన్నారు. విపత్తు రక్షణ దళాలకు చెందిన అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రారంభిస్తూ మంత్రి కేటీర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

విపత్తు సంభవించగానే ఈ ద్విచక్ర వాహనాలు త్వరితగతిన సంఘటనా స్థలానికి చేరుకుంటాయన్నారు. ట్రక్ లు వ్యాన్లు వంటివి చేరుకోవడానికి సమయం పడుతుంది కానీ ఈ ద్విచక్ర వాహనాలు వాటికన్నా ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకునే ఆస్కారముంటుందన్నారు. పెద్ద వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు కూడా ఈ ద్విచక్ర వాహనాలు చేరుకుంటాయని మంత్రి తెలిపారు. 

KTR launches two wheeler of disaster management force

రోడ్ల మీద కూలిన చెట్ల కొమ్మలను నరకడానికి, గుంతల్లో చేరిన నీటిని తోడి పోయడానికి తదితర చిన్న చిన్న పనులకు అవసరమైన సామాగ్రి అంతా ఈ ద్విచక్ర వాహనాల్లో ఉంటుందని కేటీర్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్ మోహన్, జి హెచ్ ఎం సి విపత్తు నిర్వహణ శాఖాధికారి విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios