Asianet News TeluguAsianet News Telugu

బిర్యానీలో వెంట్రుక: ప్యారడైజ్ హోటల్‌కు లక్ష జరిమానా

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు లక్ష రూపాయలు జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్యారడైజ్ ‌లో తనిఖీలు చేశారు. 

GHMC Officials Imposed Fine on secunderabad Paradise hotel
Author
Hyderabad, First Published Oct 17, 2019, 9:06 PM IST

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు లక్ష రూపాయలు జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్యారడైజ్ ‌లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో వంటసామాగ్రిలో, పారిశుధ్యంలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. ఈ నేపధ్యంలో లక్ష రూపాయల జరిమానాతో పాటు నోటీస్ ఇచ్చారు. వారం రోజులలో సరిచేసుకోకపోతే హోటల్‌కు తాళం వేస్తామని అధికారులు హెచ్చరించారు. 

దారుణం .. కన్న కూతురిని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి

కాగా ఈ ఏడాది ప్రపంచకప్ సందర్భంగా బిర్యానీ ప్రియులకు ప్యారడైజ్ బంపర్ ఆఫర్ అందించింది. వ‌ర‌ల్డ్‌ క‌ప్‌విత్‌ప్యార‌డైజ్‌ పేరుతో జరిగే పోటీలో పాల్గొని ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా, గిఫ్ట్ రూపంలో పొందవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్ నేప‌థ్యంలో న‌గ‌రంలోని క్రికెట్ ప్రియుల కోసం ప్యార‌డైజ్ ఈ పోటీ ప్రకటించింది.

చిక్కుల్లో సాహో నిర్మాతలు.. కేసు నమోదు
 
పోటీ వివరాల కోసం ప్యార‌డైజ్‌కు చెందిన ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌ల‌లో సంప్రదించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల కలిసి తమ ఔట్‌లెట్‌లకు రావాలని కోరింది.

ఈ క్రికెట్‌ సీజన్‌ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. మొన్నటి ఐపీఎల్‌ సందర్భంగా ప్యారడైజ్‌ రెగ్యులర్‌ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్‌ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే.

ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ గా పేరొందిన ప్యారడైజ్ బిర్యానీ మరో రికార్డు సాధించింది. ప్యారడైజ్ బిర్యానీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఒక సంవత్సరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బిర్యానీ అందించినందుకు గాను.. ప్యారడైజ్ కి ఘనత దక్కింది.

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఒక్క సంవత్సరంలో దాదాపు 70లక్షల మంది ప్యారడైజ్ బిర్యానీని రుచి చూశారట. అందుకే లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు సొంతం చేసుకోగలిగింది. ఈ అవార్డుతో పాటు బెస్ట్ బిర్యానీ అవార్డు కూడా ప్యారడైజ్ కి లభించింది. ఈ మేరకు ప్యారడైజ్ ఛైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది.

ఈ సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సిబ్బంది కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios