Asianet News TeluguAsianet News Telugu

పద్మావతి సినిమాపై తెలంగాణలోనూ లొల్లి

  • పద్మావతి సినిమాపై తెలంగాణలో మొదలైన వివాదం
  • సినిమాను బ్యాన్ చేయాలంటూ సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ
padmavathi movie issue in telangana

 పద్మావతి మూవీ వివాదం ఇపుడు తెలంగాణ కు తాకింది. ఇప్పటికే వివిద హిందూ మత సంఘాలు, సంస్థలు ఆ మూవీని విడుదలకాకుండా చూడాలని నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోద్ సీఎంకు లేఖ రాయడంతో తెలంగాణలోను వివాదానికి అగ్గిరాజుకున్నట్లయింది. హిందువుల మనోభావాలను దబ్బతీసే ఇలాంటి సినిమాను నిషేదించాలని సీఎం ను  కోరారు.
ఇప్పటికే ఈ సినిమాలో నటించిన నటులను చంపెస్తామంటూ, దాడులు చేస్తామంటూ వివిధ రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా దీనిపై కొందరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే సెన్పర్ నిర్ణయం వచ్చే వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీం తెలిపింది. ఇలా ఈ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతోంది.
ఇక రాజస్థాన్, మద్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఈ సినిమాను నిషేదిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదే విధంగా తెలంగాణ ప్రభుతవం కూడా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ రాజాసింగ్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. వీర వనిత పద్మిణి జీవిత చరిత్రను వక్రీకరించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారని, ఆమె హిందూ ధర్మానికి చెందిన మహిళ కావడంతోనే ఇలా చేశారని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు ఈ సినిమా తెలంగాణలో విడుదల కానివ్వకుండా చూడాలని కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్.
 

Follow Us:
Download App:
  • android
  • ios