Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు...

విజయవాడలో డ్రగ్స్ కల్చర్ పడగ విప్పుతోంది. ఉన్నత వర్గాలకు చెందిన యువతీ యువకులను టార్గెట్ గా చేసుకుని కొన్ని ముఠాలు పేట్రేగిపోతున్నాయి. 

vijayawada police arrested drugs mafia
Author
Vijayawada, First Published Oct 12, 2019, 2:53 PM IST

విజయవాడ నగరంలో డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.

 డ్రగ్స్ ముఠా నుండి 14 గ్రాముల డ్రగ్స్ ,రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి తెలిపారు. ఈ ముఠా కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు  సమాచారం అందడంతో ఈ దాడికి పాల్పడిపట్లు తెలిపారు. 

పట్టుబడిన వారిలో సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ గహేల్ రసూల్, టాంజానీయ దేశానికి లీశ్వ షాబాని ఉన్నారన్నారు. ఈ ముఠాలో అనంత్ కుమార్, శ్రీకాంత్   కీలకంగా వ్యక్తులుగా డిసిపి పేర్కోన్నారు. 

ఈ ముఠా బెంగళూరులో రూ.2000-2500 రూపాయలకు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి రూ.4000 వేల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాపై గతకొంతకాలంగా నిఘా వుంచామని... ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తో పట్టుకున్నామని తెలిపారుజ

కళాశాల యాజమాన్యం విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ కల్చర్ ని విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని...దీనిపై కళాశాలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిసిపి స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios