Asianet News TeluguAsianet News Telugu

దాచేపల్లి అత్యాచార ఘటన... వైసిపి ప్రభుత్వ కుట్రలివే...:పంచుమర్తి అనూరాధ

గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 

tdp leader panchumarthi anuradha comments on guntur incident
Author
Dachepalli, First Published Oct 29, 2019, 9:17 PM IST

గుంటూరు: దాచేపల్లి అత్యాచార ఘటనను నీరుగార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ
 ఆరోపించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను హుటాహుటిన స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌సిపి ని ప్రశ్నించారు.

దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన ఆరేళ్ల ముస్లీం మైనారిటీ బాలిక గుంటూరు పట్టణంలో చికిత్స పొందుతోంది. అయితే ఆమెను ప్రభుత్వాసుపత్రి నుండి హుటాహుటినా స్వగ్రామానికి తరలించినట్లు అనురాధ ఆరోపింస్తున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారనే సమాచారంతో ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురయ్యిందన్నారు. అందువల్లే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

read more చిన్నారిపై ఆత్యాచారం... నిందితుడికి ప్రభుత్వ అండదండలు...: చంద్రబాబు

బాధిత బాలికను హుటాహుటిన పోలీసు రక్షణతో స్వగ్రామానికి బలవంతంగా తరలించారన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన ప్రభుత్వం... వైద్యం కోసం జీజీహెచ్‌కు వచ్చిన బాలికను పోలీసు రక్షణతో స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్ర్నశించారు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి  నిదర్శనంలా నిలుస్తోందన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయని పేర్కొన్నారు. నిందితులకు వత్తాసు పలికేలా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. 

read more  బాలికపై అత్యాచారం... నిందితుడికి పోలీస్, పొలిటికల్ సపోర్ట్...: టిడిపి

పదిరోజుల క్రితం ఆరేళ్ల ముస్లీం మైనారిటీ బాలికపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు నరేందర్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 10 రోజుల నుంచి బాలిక నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటివరకు ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోలేదు. 

నిందితుడు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు కాబట్టి ప్రభుత్వం అతడికి కొమ్ముకాస్తోందని... కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముస్లీం మైనారిటీ పెద్దలు  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని కలిసి వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని, తగిన న్యాయం చేయాలని కోరారు.

దీంతో వెంటనే స్పందించిన చంద్రబాబు మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. ఈ బృందం 26వ తేదీన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  దీంతో ప్రభుత్వం బాలికను గుంటూరు జీజీహెచ్‌కు హుటాహుటిన తరలించింది. 

అదే రోజు రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సదరు బాలికను పరామర్శించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అనురాధ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి సుచరిత ప్రకటించిన పరిహారం కూడా మాటలకే పరిమితం అయిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేసి... నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.         

Follow Us:
Download App:
  • android
  • ios