Asianet News TeluguAsianet News Telugu

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్‌... జగన్ పార్టీకి మాజీ మంత్రి వార్నింగ్

మీడియా స్వేచ్చను హరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా వుండే  మీడియాపై దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.  

tdp leader kalva srinivasulu warning to jagan government
Author
Amaravathi, First Published Oct 30, 2019, 5:59 PM IST

అమరావతి: అధికార గర్వం కేవలం వైఎస్సార్‌సిపి నాయకత్వానికే కాదు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు కూడా పాకిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అందువల్లే తమకు అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని... ఇలాంటి చర్యలను ఆపాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కాల్వ మండిపడ్డారు. 

ఇటీవల ప్రకాశం జిల్లా పర్చూరులో ఓ మీడియా సంస్థకు చెందిన సిబ్బందిపై  వైఎస్సార్‌సిపి దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని... జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియా, జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు.

read more   దగ్గుబాటి ఎఫెక్ట్: పర్చూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి

ముఖ్యంగా మీడియా సంస్థలు, ప్రతినిధులపై ఆంక్షలు, వేధింపులకు గురిచేసి పత్రికా స్వేచ్ఛను హరించిస్తున్నాయని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేయటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు అబాసు పాలవ్వడం చరిత్రలో చూశామని... ఈ పార్టీకి అదేగతి పడుతోందని విమర్శించారు. 

ప్రస్తుతం సీఎం జగన్ ప్రవర్తన చరిత్రను తిరగతోడేలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కనపడనీయకుండా చేయాలని మీడియాను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 రాజధానికి పర్చూరు పంచాయితీ: ఆయన వద్దు దగ్గుబాటే ముద్దంటున్న వైసీపీ నేతలు

ప్రతిపక్ష పార్టీకి పెరుగుతున్న ప్రజల మద్ధతు నుంచి పక్కదారి పట్టించాలని వైసిపి నేతలు జర్నలిస్టులపై దాడులు, కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విలేకర్లు, పత్రికలు స్వేచ్ఛగా పని చేసుకున్నాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో మీడియా సంస్థలకు ఎప్పుడు కూడా అడ్డురాలేదన్నారు. 

జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఎక్కడ భయటపడుతుందోనన్న ఉద్దేశంతో మీడియా ఆంక్షలు, జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా మిత్రులపై దాడులపై చేస్తే ఖబర్దార్‌ అంటూ  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అన్యాయాన్ని ఎదిరించే వారిపై జరుగుతున్న ఈ దాడులకు లుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతుగా వుంటుందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 

                                              

Follow Us:
Download App:
  • android
  • ios