Asianet News TeluguAsianet News Telugu

ఇది ప్రభుత్వమా... జగన్ రియల్ ఎస్టేట్ సంస్థనా...?: సుజయకృష్ణ రంగారావు

మిషన్‌బిల్డ్ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు, సీఎం జగన్ ఉత్సాహం చూపుతున్నారని మాజీ మంత్రి,టిడిపి నాయకులు సుజయ కృష్ఱ రంగారావు ఆరోపించారు.  

 

sujaya krishna rangarao fires on  ys jagan government
Author
Guntur, First Published Nov 1, 2019, 5:36 PM IST

గుంటూరు: మిషన్‌బిల్డ్ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని టీడీపీ నేత, మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లస్థలాలకు భూములు లేవంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే తతంగానికి తెరతీశారని ఆరోపించారు. 

శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  మిషన్‌బిల్డ్ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు ఉత్సాహం చూపడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చెప్పి వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కాజేసిన వాన్‌పిక్‌ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేతగాలేదన్నారు.

అటువంటి సంస్థల కింద ఉన్న భూముల్ని వదిలేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వభూములపై కన్నేసిన జగన్ ఎన్నికల సమయంలో తనకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టే కుతంత్రానికి తెరతీశాడని మండిపడ్డారు. ఉన్న భూముల్ని ఇష్టమొచ్చినట్లు తనవారికి దారాధత్తం చేస్తే, భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు భూములు ఎక్కడినుంచి వస్తాయో వైసీపీ అధినేత సమాధానం చెప్పాలన్నారు. 

read more  క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ

ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్‌ కంపెనీలా వ్యవహరించడం దారుణమని ఆయన వాపోయారు.  ఓవైపు ప్రైవేట్‌భూములు కొనుగోలుచేసి పేదలకు ఇస్తామంటూనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మాలని చూడటం జగన్‌ తుగ్లక్‌ చర్యల్లో భాగమేనని రంగారావు దుయ్యబట్టారు. వనరుల నుంచి సంపద సృష్టించడం చేతగాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం భూముల్ని అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. 

లోటుబడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని ఆర్థికంగా  ఆదుకునేందుకు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చేశారని సుజయకృష్ణ తెలిపారు. వైసీపీ పాలన చూసి భయభ్రాంతులకు గురైన పారిశ్రామికవేత్తలు పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే బ్యాంకుల, ఇతర రుణ మంజూరు సంస్థలు ప్రభుత్వ వైఖరితో చేతులేత్తేసిన దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. 

పెట్టుబడిదారుల్లో నమ్మకం సృష్టించలేని వైసీపీ సర్కారు చివరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి పూనుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న ఆదానీ గ్రూప్‌ (రూ.70వేలకోట్ల పెట్టుబడులతో విశాఖ పట్నంలో పెట్టాలనుకున్న పరిశ్రమ) తెలంగాణకు తరలడానికి సిద్ధమైందన్నారు. 

read more  video: ఉన్నతాధికారుల వేధింపులు... నడిరోడ్డుపై కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

అదేవిధంగా కియా కార్లపరిశ్రమ రూ.2వేలకోట్లతో ఏర్పాటు చేయాలనుకున్న అనుబంధ పరిశ్రమలన్నీ కర్ణాటక, తమిళనాడు బాటపట్టాయని తెలిపారు. రూ.24వేలకోట్లతో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పడాల్సిన పేపర్‌ పరిశ్రమ, చిత్తూరు జిల్లాలో రూ.10వేలకోట్లతో ప్రారంభం కావాల్సిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెనక్కు వెళ్లాయన్నారు. 

ప్రపంచప్రఖ్యాతి పొందిన లులూ గ్రూప్‌ పర్యాటక రంగంలో విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న పరిశ్రమలు, విద్యారంగంలో సుమారు రూ.12వేలకోట్లతో పెట్టుబడులు పెట్టాలనుకున్న బీఆర్‌.షెట్టి గ్రూప్‌కు చెందిన సంస్థలు రాష్ట్రంనుంచి వెనక్కు వెళ్లేలా చేసిన ఘనత వైసీపీ సర్కారుదేనని దుయ్యబట్టారు.

తన అరాచక, అసమర్ధ పాలనతో రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులను రాకుండా చేసిన జగన్ చివరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి పూను కోవడం దారుణమన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసి ప్రభుత్వ ఆస్తులు, భూములమ్ముతూ జగన్‌ ఎన్నాళ్లు పాలనచేస్తారని మాజీమంత్రి సుజల నిలదీశారు.  

 


 

Follow Us:
Download App:
  • android
  • ios