Asianet News TeluguAsianet News Telugu

ఏపిపిఎస్సీ నుండి భారీ ఉద్యోగ నోటిపికేషన్లు...

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఏపిపిఎస్సి(ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) తీపి కబురు అందించింది. ఈ నెలాఖరుకల్లా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగు వున్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేయనున్నట్ల ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు నిన్న (గురువారం) విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో సభ్యులు, అధికారులతో చర్చించి కమీషన్ ఛైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. 
 
appsc plans to release more employment notifications in this month
Author
Amaravathi, First Published Dec 21, 2018, 7:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఏపిపిఎస్సి(ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) తీపి కబురు అందించింది. ఈ నెలాఖరుకల్లా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగు వున్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేయనున్నట్ల ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మేరకు నిన్న (గురువారం) విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో సభ్యులు, అధికారులతో చర్చించి కమీషన్ ఛైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన సమాచారాన్ని ఏపిపిఎస్సి అందించింది. అంతేకాకుండా వాటి నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో అనుమతి లభించిన ఉద్యోగాలన్నింటికి సంబంధించి ఒకేసారి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపిపిఎస్సి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 

దేవాదాయ శాఖలో ఖాళీగా వున్న 60 ఈవో , సిసిఎల్ఎ విభాగంలోని 29 డిప్యూటీ సర్వేయర్, మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా వున్న 109 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, సమాచార, పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్‌ పీఆర్‌వో, ఖాళీగా వున్న అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్ల పోస్టులకు అతి త్వరలో నోటిపికేషన్జారీచేయనున్నట్లు ఏపిపిఎస్సి అధికారులు తెలిపారు. 

అంతేకాకుండా భారీ ఎత్తును పంచాయితీ సెక్రటరీ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం నుండి ఏపిపిఎస్సికి అనుమతులు లభించాయి. దాదాపు 1067 పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలకు త్వరలో నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే  406 పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, 308 డిగ్రీ లెక్చరర్లు, 200 జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి కూడా ఏపిపిఎస్సీ సన్నాహాలు చేస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios