Asianet News TeluguAsianet News Telugu

8 జీబీ టూ 12 జీబీ ప్లస్ స్పీడ్ చార్జింగ్: వివో ఐక్యూ ఫోన్ స్పెషాలిటీ

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ ఫోన్ స్పెషాలిటీస్ అనేకం ఉన్నాయి. 8 జీబీ రామ్ మొదలు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతోపాటు 45 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర రూ.35 వేల నుంచి రూ.45,500 వరకు పలుకుతోంది.

Vivo iQOO Gaming Smartphone With Snapdragon 855 Processor, 12GB RAM Launched
Author
New Delhi, First Published Mar 3, 2019, 10:46 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ సబ్ బ్రాండ్ ‘ఐ క్యూ’విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ గేమర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి ఆవిష్కరించింది. వివో ఐక్యూ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ అమర్చారు. 8 జీబీ మొదలు 12 జీబీ రామ్ నుంచి 128/256 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్‌గా నిలువనున్నది. 

వివో ఐక్యూ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 4000 ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చడంతో ఫోన్ చార్జింగ్ 15 నిమిషాల్లో 50 శాతం, 30 నిమిషాల్లో 85 శాతం, 45 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు. 

వాటర్ డ్రాప్ నాచ్‌తోపాటు 6.41 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కూడా అమర్చారు. ఎఐ టర్బో, సెంటర్ టర్బో, నెట్ టర్బో, కూలింగ్ టర్బో, గేమ్ టర్బో వంటివన్నీ మల్టీ టర్బో పేరిట వన్ సర్వీస్‌గా చేర్చారు.

13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన బ్యాక్ ట్రిపుల్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 263 సెన్సర్, డ్యుయల్ మెగా పిక్సెల్ టెక్నాలజీతో మెయిన్ 12 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా లభిస్తోంది.

ఎలక్ట్రిక్ బ్లూ, లావా ఆరెంజ్ రంగుల్లో వివో ఐక్యూ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది.మార్కెట్లో దీని ధర రూ.32,000 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర సుమారు రూ.35,000.

8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ రూ.38,000, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఫోన్ ధర రూ.45,500 పలుకుతోంది. అయితే భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి ఇంకా వెల్లడి కాలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios