Asianet News TeluguAsianet News Telugu

రెడ్‌మీ గోకి పోటీ: రూ.5,290కే శామ్సంగ్ గెలాక్సీ ఎ2 కోర్

దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ నుంచి భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ విడుదలైంది. గెలాక్సీ ఎ2 కోర్ పేరుతో, ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ ఆవిష్కరించింది. దీని ధర రూ.5,290గా నిర్ణయించింది. 

Samsung launches Galaxy A2 Core with Android Go for Rs 5,290
Author
New Delhi, First Published Apr 16, 2019, 6:27 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ నుంచి భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ విడుదలైంది. గెలాక్సీ ఎ2 కోర్ పేరుతో, ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ ఆవిష్కరించింది. దీని ధర రూ.5,290గా నిర్ణయించింది. 

శామ్సంగ్ గెలాక్సీ ఎ2 కోర్ ఫీచర్లు:

5 అంగుళాల డిస్‌ప్లే
960x540 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఎక్సోనస్ 7870 ఎస్ఓసీ
1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ
మైక్రో ఎస్‌డీ కార్డుతో 256జీబీకి విస్తరించుకోవచ్చు
5 ఎంపీ రేర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2600 ఎంఏహెచ్ బ్యాటరీ

కాగా, ఆండ్రాయిడ్ 9 గో వాడుతున్న తొలి శామ్సంగ్ డివైజ్ ఇదే కావడం గమనార్హం. ఈ స్మార్ట్ ఫోన్ చైనా మొబైల్ తయారీ దిగ్గజం తీసుకొచ్చిన బడ్జెట్ ఫోన్ రెడ్ మీ గోకి గట్టి పోటీ ఇవ్వనుంది. 

జియోమీ రెడ్‌మీ గో ధర రూ. 4499. 8ఎంపీ రేర్ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్‌గా ఉంది. 5 ఇంచ్ హెచ్‌డీ స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425, 1జీబీ ర్యామ్ కలిగివుంది. ప్రస్తుతం ఇదే మనదేశంలో అందుబాటు ధరలో ఉన్న ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్‌గా కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios