Asianet News TeluguAsianet News Telugu

రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా: శామ్‌సంగ్‌ గెలాక్సీ ‘ఏ80’ స్పెషల్

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘శామ్ సంగ్’ రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా గల గెలాక్సీ ‘ఎ80’, ‘ఎ70’, ‘ఎ40’ ఫోన్లను ఆవిష్కరించింది. త్వరలో వినియోగదారుల దరి చేరనున్నాయి.

Samsung  Galaxy A80 Launched With  Rotating Triple Camera
Author
Bangkok, First Published Apr 11, 2019, 3:02 PM IST


బ్యాంకాక్: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ సరికొత్త టెక్నాలజీతో గెలాక్సీ కొత్త ఫోన్లను పరిచయం చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఏ 80, ఏ 70, గెలాక్సీ ఏ 40 పేరుతో  మూడు  స్మార్ట్‌ఫోన్లను బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన శాంసంగ్‌ ఈవెంట్‌లో  ఆవిష్కరించింది. గెలాక్సీ ఏ 80 స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ రొటేటింగ్‌ పాప్‌ అప్‌ కెమెరా  ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

సెల్పీ తీసుకోవాలంటే.. సెల్ఫీ మోడ్‌ సెలెక్ట్‌ చేయగానే ఈ కెమెరా రొటేట్‌ అవుతుందన్నమాట. బ్లాక్‌ గోల్డ్‌, వైట్‌ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనున్నది.  అలాగే వాటర్‌డ్రాప్‌ డిస్‌ప్లే 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  లాంటి ఫీచర్లతో ఏ 70ని తీసుకొచ్చింది. శామ్సంగ్ గెలాక్సీ ఎ80 ఫోన్  బ్లాక్‌బ్లూ, వైట్‌ ,పింక్‌ కలర్లలో లభ్యం కానుంది. గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను  మే 29న,  గెలాక్సీ  ఏ 70ని ఏప్రిల్‌ 26న గ్లోబల్‌ లాంచ్‌ చేయనుంది.

ఇవీ శామ్ సంగ్ గెలాక్సీ ఏ80 ఫీచర్లు
శామ్ సంగ్ గెలాక్సీ ఏ 80 స్మార్ట్ ఫోన్ 6.7 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో 1080x2400  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. ఇంకా  కాల్కం  స్నాప్‌డ్రాగన్‌ 730 జీ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 9.0పై చేర్చారు. 8 జీబీ ర్యామ్‌ సామర్థ్యంతోనాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ కెపాసిటీ దీని సొంతం.  3700 ఎంఏహెచ్‌ బ్యాటరీతోపాటు 48+8+3డీ డెప్త్‌ టీఓఎఫ్‌ ఎంపీ రియర్‌ కెమెరా ఆకర్షణగా నిలిచాయి. 

శామ్ సంగ్ గెలాక్సీ ఏ 70 స్పెషాలిటీస్

6.7 ఫుల్‌హెచ్‌డీ (వాటర్‌డ్రాప్‌) డిస్‌ప్లే గల శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 70 స్మార్ట్ ఫోన్ 2340 × 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 32+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ప్లస్ 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. అదనంగా 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా అమర్చారు. 

10 బిలియన్‌ డాలర్ల ఐపీవోకు సిద్ధమైన ఉబెర్‌

క్యాబ్‌సేవల దిగ్గజం ఉబెర్‌ ఐపీవోకు సిద్ధమైంది. మొత్తం 10 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలను ఇది విక్రయించనుంది. దీని పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఐపీవో సైజ్‌ను బట్టి 2014 తర్వాత ఒక టెక్నాలజీ సంస్థ తీసుకొస్తున్న పెద్ద ఐపీవోగా నిలిచిపోనుంది. తొలుత ఉబెర్‌ విలువను 120 బిలియన్‌ డాలర్లుగా భావించారు. కానీ ఇటీవల క్యాబ్‌ సేవల సంస్థ ఎల్‌వైఎఫ్‌టీ ఐపీవోకు వచ్చి పెట్టుబడి దారులను ఆకర్షించలేకపోయింది. 

ఉబెర్ విలువ కుదింపు ఇలా 

దీంతో ఉబెర్‌ విలువను 90-100 బిలియన్‌ డాలర్ల మధ్య కుదించారు. కొన్నాళ్ల కిందట ఒక నిధుల సమీకరణలో ఉబెర్‌ విలువను 76 బిలియన్‌ డాలర్లుగా లెక్కించారు. అమెరికా సెక్యూరిటీ అండ్‌ ఎక్స్చేంజ్ కమిషన్‌ వద్ద ఉబెర్‌ గురువారం ఐపీవోకు రిజిస్టర్‌ చేసుకోనుంది. ఏప్రిల్‌ చివరల్లో రోడ్‌షో నిర్వహిస్తుంది. మే మొదటి వారంలో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో నమోదు కావచ్చని భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios