Asianet News TeluguAsianet News Telugu

ఆరోజే ప్రకటన: OnePlus 7, OnePlus 7 Pro లాంచ్‌పై సీఈఓ

వన్‌ప్లస్ 7(OnePlus 7) మొబైల్ మే 14న విడుదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంస్థ సీఈఓ పీట్ లూ ఏప్రిల్ 23న మొబైల్ విడుదలపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఎదురుచూస్తున్నారు.

OnePlus 7, OnePlus 7 Pro Launch Date to Be Announced on   Tuesday, CEO Pete Lau Says
Author
New Delhi, First Published Apr 20, 2019, 4:20 PM IST

వన్‌ప్లస్ 7(OnePlus 7) మొబైల్ మే 14న విడుదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంస్థ సీఈఓ పీట్ లూ ఏప్రిల్ 23న మొబైల్ విడుదలపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఎదురుచూస్తున్నారు.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాతోపాటు పాపప్ సెల్ఫీ సెన్సార్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ పవర్‌తో ఈ ఫోన్లు రానున్నాయి. వీటితోపాటు 5జీ వేరియెంట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

వచ్చే మంగళవారం(ఏప్రిల్ 23న) వన్‌ప్లస్ మొబైల్ ఫోన్ల విడుదల కార్యక్రమం ఉంటుందని ట్విట్టర్ వేదికగా పీట్ లూ తెలిపారు. అయితే, మరే ఇతర విషయాలు వెల్లడించలేదు. అయితే, వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 ప్రో 5జీ వేరియెంట్లలో మొబైల్స్ విడుదలవుతాయని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. 

 

లీకైన సమాచారం ప్రకారం.. స్పోర్ట్ వాటర్‌డ్రాప్ నాచ్, డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 7 ఉంటుందని తెలుస్తోంది. ఇది కెమెరా బంప్‌తో 157.7x74.8x8.1mm డైమెన్షన్, 9.5mm థిక్నెస్ ఉండనుంది. పవర్ బటన్ తోపాటు అలర్ట్ బటన్ కూడా ఉంటుంది. ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే, వాల్యూమ్ రాకర్ ఉంటాయి. 

వన్‌ప్లస్ 7.. 6.4 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లే, డ్యూయెల్ కెమెరా సెటప్, 48మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది..

ఇక వన్‌ప్లస్ 7 ప్రో పాప్ అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్, బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. అంతేగాక, డ్యూయెల్ ఎడ్జ్‌డ్ డిస్‌ప్లే ప్యానెల్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

వన్‌ప్లస్ 7 ప్రో 6.64 ఇంచ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే పాప్ అప్ ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్. టెలిఫొటో, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్సెస్‌తో రేర్ కెమెరా కలిగివున్నట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ 7 ప్రో.. క్వాడ్ హెచ్‌డీ+సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, రిఫ్రేష్ రేట్ 90హెచ్‌జడ్. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వ్రాప్ ఛార్జ్ 30w ఫాస్ట్ ఛార్జింగ్ టెక్. అంతేగాక ఈ ఫోన్‌కు డ్యూయెల్ స్పీకర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి: ఒక ఫోన్ బాలేదంటే.. 10 పిక్సెల్3 ఫోన్లు పంపిన గూగుల్!

Follow Us:
Download App:
  • android
  • ios