Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్‌లో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్ మార్కెట్లోకి ఇప్పటికే చాలా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో, గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్, రియల్‌మీ 3, మిడ్ రేంజ్ డివైసెస్ వీవో వీ15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో మొదలైనవి సిద్ధంగా ఉన్నాయి. 

Best smartphones to launch in April: Huawei P30 Pro, Nokia 9   PureView, Realme 3 Pro, Samsung Galaxy A90
Author
Hyderabad, First Published Apr 9, 2019, 6:56 PM IST

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్ మార్కెట్లోకి ఇప్పటికే చాలా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో, గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్, రియల్‌మీ 3, మిడ్ రేంజ్ డివైసెస్ వీవో వీ15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో మొదలైనవి సిద్ధంగా ఉన్నాయి. 

అయితే, ఏప్రిల్‌లో మరిన్ని ఫోన్లు కూడా వీటికి పోటీగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 

రియల్‌మీ 3 ప్రో

రియల్‌మీ 3ని మార్చిలో లాంచ్ చేసిన సమయంలోనే ఏప్రిల్‌లో దీని ప్రో వేరియెంట్ విడుదల చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో ఫీచర్లు ఇలా ఉండనున్నాయని తెలుస్తోంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710ఎస్ఓసీ, సోనీ ఐఎంఎక్స్519 కెమెరా సెన్సార్. VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంది. దీంతో 0 నుంచి 75శాతం ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లోనే ఎక్కుతుంది. 

ఇవి మూడు వేరియెంట్లలో లభ్యమవుతున్నాయి. 4జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీ, 4జీబీ/64జీబీ స్టోరేజీ, 6జీబీ/64జీబీ స్టోరేజీ. అయితే, వీటి ధరను ప్రకటించలేదు. దీని ధర రూ.13.999గా ఉండే అవకాశం ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఏ90

శామ్సంగ్ ప్రస్తుతం గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ సిరీస్ లాంచ్ చేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే  Galaxy A10, A30, A50, A20 ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఏప్రిల్ 10న 5వ గెలాక్సీ ఏ సిరీస్ డివైస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆ మొబైల్ గెలాక్సీ ఏ90నే అని తెలుస్తోంది.

భారతదేశంలో గెలాక్సీ ఏ లైనప్‌లో ఏ90 అత్యంత ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ కానుంది. శామ్సంగ్ నుంచి వచ్చే తొలి గరిష్ట ఇన్ఫినిటీ స్క్రీన్ కలిగిన స్మార్ట్ ఇదే అవుతుంది. మొత్తం స్క్రీన్ కలిగిన ఈ ఫోన్లు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో  అందుబాటులో లేవు. 

నోకియా 9 ప్యూర్ వ్యూ

నోకియా 9 ప్యూర్ వ్యూని ప్రవేశపెట్టడం ద్వారా మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2019లో మరోసారి నోకియా తన వైభవాన్ని చాటుకుంది. ఈ కొత్త మొబైల్‌ కెమెరా యూనిట్‌కు ఐదు సెన్సార్‌లు ఉండటం విశేషం. లైట్‌తో కలిసి నోకియా ఈ కెమెరాను సెటప్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 845తో ఈ ఐదు కెమెరాలను నోకియా 9 మేనేజ్ చేస్తోంది. ఈ ఐదు కెమెరాల్లో రెండు కలర్ షూట్ చేస్తే.. మరో మూడు మోనోక్రోమ్ చేస్తాయి. ఐదు కెమెరాలు కూడా ఎఫ్/లెన్స్‌తో 12మెగా పిక్సెల్స్ సెన్సార్ కలిగి ఉన్నాయి.

నోకియా 9 ప్యూర్ వ్యూ అదనపు ఫీచర్లు గమనిస్తే.. 5.99 ఇంచుల 2కే పో ఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానల్, డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ ఎస్ఓసీ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీని కలిగివుంది. ఏప్రిల్‌లో ఈ ఫోన్‌‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టే సందర్భంలో ఫోన్ ధరను నోకియా ప్రకటించే అవకాశం ఉంది.

హువాయ్ P30 ప్రో

హువాయ్ పీ30 ప్రో కూడా ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. పీ30 ప్రో ఫీచర్లు ఇలా ఉన్నాయి. 6.47 ఇంచుల స్లిమ్ బెజెల్స్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే,  డ్యూడ్రాప్ నాచ్. 

2340 x 1080 మ్యాక్స్ రిజల్యూషన్, 19.5:9 కారక నిష్పత్తి HDR10 సపోర్ట్. 8జీబీ ర్యామ్‌తో 7ఎన్ఎం కిరిన్ 980 ఎస్ఓసీ కలిగివుంది. స్క్వాడ్ కెమెరా సెటప్ అనేది పీ30 ప్రో న్యూస్ మేకర్ పీచర్. 40ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా.. సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్. ఇతర కెమెరాల్లో 20ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్, 5x పెరిస్కోప్(ఆప్టికల్ జూమ్). ఫ్లైట్ కెమెరా పొర్టరేట్ షాట్స్ తీసేందుకు ఉపయోగపడుతుంది. అమెజాన్ ఇండియా పేజీలో ఒకసారి ఈ ఫోన్ దర్శనమిచ్చినప్పటికీ.. ఏప్రిల్ 9న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని హువాయ్ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios