Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఫేమ్ తనీష్ 'రంగు' వర్కవుట్ అవుతుందా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి హీరోగా పలు సినిమాలలో నటించాడు తనీష్. ఆ మధ్య కృష్ణవంశీ రూపొందించిన 'నక్షత్రం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చిన తనీష్ ఫైనల్స్ వరకు చేరుకున్నారు. ఈ షోతో తనీష్ కి కాస్త ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. 

will tanish get success with rangu movie
Author
Hyderabad, First Published Nov 21, 2018, 4:14 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి హీరోగా పలు సినిమాలలో నటించాడు తనీష్. ఆ మధ్య కృష్ణవంశీ రూపొందించిన 'నక్షత్రం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చిన తనీష్ ఫైనల్స్ వరకు చేరుకున్నారు.

ఈ షోతో తనీష్ కి కాస్త ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. తను నటించిన 'రంగు' అనే సినిమాను బయటకి తీసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

విజయవాడకి చెందిన లారా అనే రౌడీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా వివాదాలతో వార్తల్లో నిలిచింది. తమ అనుమతి లేకుండా సినిమా తీశారంటూ లారా బంధువులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఎన్ని వివాదాలు వచ్చినా.. ఈ సినిమా తన కెరీర్ కి కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నాడు తనీష్. నిర్మాతలు కూడా ఈ సినిమాపై నమ్మకంతో ప్రచార కార్యక్రమాలపై బాగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తనీష్ సినిమా గనుక వర్కవుట్ అయితే కౌశల్ ని హీరోగా పెట్టి సినిమా చేసే సాహసం చేయొచ్చని కొందరు నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios