Asianet News TeluguAsianet News Telugu

'ఎఫ్ 2': ఫ్యాన్స్ వార్... క్రెడిట్ ఏ హీరోకి చెందాలి?

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు వరుసగా పెట్టాయి.  కథ బాగుంటే సీనియర్ హీరోలతో కలిసి, యంగ్ హీరోలు ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించేస్తున్నారు. 

who will Get credit to F2 success?
Author
Hyderabad, First Published Jan 15, 2019, 11:38 AM IST

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు వరుసగా పెట్టాయి.  కథ బాగుంటే సీనియర్ హీరోలతో కలిసి, యంగ్ హీరోలు ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించేస్తున్నారు. ఈ  మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా విక్టరీ వెంకటేష్ కనిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్ లాంటి హీరోలతో నటించిన వెంకి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'ఎఫ్ 2' చిత్రంలో నటించారు.  అనిల్ రావిపూడి  డైరక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 

అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. ఈ సినిమా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ఫ్యాన్స్ మధ్య వార్ కు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో ఈ యుద్దం ఆల్రెడీ మొదలైంది. మెగా ఫ్యాన్స్ ఈ క్రెడిట్ ని తమ ఖాతాలోనే వెయ్యాలంటున్నారు. ఈ సినిమాకన్నా ముందే వరుణ్ తేజ్ ..తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నాడని, అతని ఛరిష్మాతోనే మంచి ఓపినింగ్స్ వచ్చాయని చెప్తున్నారు. 

అదే సమయంలో వెంకటేష్ ఫ్యాన్స్ సైతం వాదన మొదలెట్టారు. వెంకటేష్ లేకుండా అసలు ఆ సినిమాని ఊహించగలరా అంటున్నారు. వెంకటేష్ మొత్తం ఈ సినిమాని తన భుజాలపై మోసాడని, కావాలంటే రివ్యూలు చూసుకోండి..పబ్లిక్ టాక్ వీడియోలు చూసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. 

అయితే వెంకటేష్ లేకపోతే ఈ సినిమా ఆ స్దాయి విజయం సాధించేది కాదు అన్నది నిజమే కానీ..వరుణ్ తేజ్ కూడా తనదైన టైమింగ్ తో సినిమాని నిలబెట్టాడు అనేది నిర్విదాంశం. అన్నిటికన్నా ముఖ్యంగా దర్శకుడు అనీల్ రావిపూడి ప్రతిభ, ఫన్ టైమింగ్ ఈ సినిమా ఘన విజయానికి ప్లస్ అయ్యిందనే విషయం మర్చిపోకూడదు. 

'ఎఫ్ 2' సెకండ్ డే కలెక్షన్స్!

'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

Follow Us:
Download App:
  • android
  • ios