Asianet News TeluguAsianet News Telugu

'సైరా' వర్సెస్ 'వార్' : ఇంపాక్ట్ మాములుగా ఉండదు!

చిరంజీవి నటించిన సైరా సినిమాకు, హృతిక్ చేసిన వార్ సినిమాకు నార్త్ లో పోటీతప్పదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ సౌత్ లో కూడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంది. 
 

war movie impact on syeraa
Author
Hyderabad, First Published Oct 1, 2019, 12:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమాకు పోటీగా హృతిక్ రోషన్ నటించిన 'వార్' సినిమా విడుదలవుతోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'వార్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నార్త్ అయితే ఈ రెండు సినిమాల మధ్య పోటీతప్పదనే చెప్పాలి. అయితే సౌత్ లో కూడా ఈ రెండు సినిమాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. 
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ లేదని అనుకుంటున్నారు. 

పోటీ లేకపోయినా 'వార్' ఇంపాక్ట్ మాత్రం 'సైరా'పై పడుతోంది. ఉదాహరణకు నైజాం ఏరియా తీసుకుంటే.. అత్యంత కీలకమైన హైదరాబాద్ లో 'సైరా' సినిమాకు పోటీగా 'వార్' నిలిచింది. సింగిల్ స్క్రీన్స్ లో 'సైరా' డామినేట్ చేస్తున్నప్పటికీ.. హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లలో 'వార్' సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్స్ సంపాదించింది. 'సైరా' విడుదల తేదీ ప్రకటించడానికి ముందుగానే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ మల్టీప్లెక్స్ లతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

జాతీయ స్థాయిలో డీల్ కావడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య 'సైరా' కొన్ని స్క్రీన్స్ కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క హైదరాబాద్ లోనే 'వార్' సినిమాకి మొదటిరోజు రెండు వందలకు  పైగా షోలు పడుతున్నాయి. పైగా బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. కాబట్టి ఈ మేరకు 'సైరా' సినిమాపై ప్రభావం పడినట్లే.. ఐమాక్స్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్ లలో 'సైరా'తో సమానంగా 'వార్' హిందీ వెర్షన్ టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

హైదరాబాద్ లో మాత్రమే పరిస్థితి ఇలా ఉందంటే మిగిలిన ఏరియాలు కూడా కలుపుకుంటే 'వార్' ప్రభావం 'సైరా'పై పడిందనే విషయం అర్ధమవుతోంది. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వైజాగ్, విజయవాడలో కొన్ని మల్టీప్లెక్స్ లలో మాత్రమే 'వార్' సినిమాకి చోటు దక్కింది.  కాకపోతే హిందీ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఏపీలో కాస్త ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలవుతోంది.

కానీ 'సైరా'తో అక్కడ పోటీ పడే ఛాన్స్ లేదు. కేరళ, తమిళనాడులో 'వార్' హవా అంతగా లేదు. మళ్లీ బెంగుళూరులో మాత్రం హైదరాబాద్ పరిస్థితే కనిపిస్తోంది. సౌత్ లో 'సైరా'కి 'వార్' పోటీ కానప్పటికీ నైజాంలో మాత్రం మొదటిరోజు 'సైరా' వసూళ్లపై 'వార్' తన ప్రభాస్ చూపే ఛాన్స్ ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios