Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ 2020 దాకా సైలెంట్?

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా..పెద్ద సినిమాలకు కలక్షన్స్ కుమ్మేస్తోంది, బ్లాక్ బస్టర్ పోస్టర్లు తప్పనిసరి. అలాగే వెంటనే సక్సెస్ మీట్ పెట్టి దర్శక,నిర్మాతలతో పాటు హీరో కూడా మాట్లాడి ..ఇంత పెద్ద హిట్ చేసినందకు ధాంక్స్ అని చెప్తూంటారు. 

Vinaya Vidheya Rama: Ram charan turns silent mode
Author
Hyderabad, First Published Jan 17, 2019, 1:42 PM IST

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా..పెద్ద సినిమాలకు కలక్షన్స్ కుమ్మేస్తోంది, బ్లాక్ బస్టర్ పోస్టర్లు తప్పనిసరి. అలాగే వెంటనే సక్సెస్ మీట్ పెట్టి దర్శక,నిర్మాతలతో పాటు హీరో కూడా మాట్లాడి ..ఇంత పెద్ద హిట్ చేసినందకు ధాంక్స్ అని చెప్తూంటారు. హిట్ అయితే ఏ సమస్యా లేదు. అదే తేడా కొట్టి ప్లాప్ అయితే మాత్రం ఈ రకం హంగామా చూసి జనం  నవ్వుకుంటూంటారు. ఈ విషయం హీరోలకూ తెలుసు. 

అయితే ఫార్మాలిటీ కోసం,నిర్మాత ఫీల్ అవకుండా ఉండటం కోసం అలా ముఖానికి నవ్వు పులుముకుని మీడియాతో మాట్లాడుతుంటారు. అయితే ఇలాంటివి రామ్ చరణ్ కు ఇష్టం లేదట. ఖచ్చితంగా తను విన‌య‌విధేయ‌రామ‌ సినిమా గురించి బయిటకు వచ్చి మాట్లాడను అని చెప్పేసాడట.  సినిమా రిలీజ్ అయ్యాక..ప్లాఫ్ ,హిట్ అనేవి కామన్ అని, అయితే వినయ విధేయరామ చిత్రం ఫ్లాఫ్ అవటమే కాక సోషల్ మీడియా జనం ట్రోల్స్ చేస్తూ విపరీతంగా విమర్శలు చేసారు. ఇది రామ్ చరణ్ ని బాధించిందట.

తన తండ్రి కోరిక మేరకు ..డైరక్టర్ చెప్పిన సీన్స్ ..చేసుకుంటూ వెళ్లాను కానీ, తనకు తెలియక కాదు అని తన సన్నిహితులతో చెప్పారట. దాంతో ఇక ఎంత త్వరగా ఈ సినిమాని మర్చిపోతే అంత మంచిది అని ఫీలయ్యారట. ఇప్పుడు చరణ్ దృష్టి మొత్తం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంపైనే ఉంది. ఆ సినిమా హిట్ అయ్యాక అప్పుడు మీడియాతో మాట్లాడదాం అనుకుంటున్నారు.  అంటే 2020 వేసవి దాకా ఆగాలి. అంటే ఓ సంవత్సరం పైగా టైమ్ ఉందన్నమాట.

రాంచ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య‌విధేయ‌రామ‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో సన్నివేశాలు గురించి అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios