Asianet News TeluguAsianet News Telugu

ఏడవను.. ఎన్నికల్లో గెలిచి చూపిస్తా: సీనియర్ నటి కామెంట్స్

 

ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్ బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళా మటోంద్కర్‌ పై గత కొంత కాలంగా ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఊర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

urmila matondkar comments on trolls
Author
Hyderabad, First Published Apr 8, 2019, 2:00 PM IST

ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్ బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళా మటోంద్కర్‌ పై గత కొంత కాలంగా ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఊర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊర్మిళ పేరు మరియమ్‌ అక్తర్‌ మిర్‌ అంటూ 2015లో కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్‌ అక్తర్‌ మిర్‌ను మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ పేరొచ్చిందని ట్రోలింగ్ నడిచింది,. 

ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలపై కామెంట్ చేస్తూనే ట్రోల్స్ చేస్తున్నవారికి కూడా కౌంటర్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన యాక్టర్ ని అంటూ.. మెదడు లేదని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆ మాటలకు నేను ఏడుస్తూ కూర్చొను. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఏ మాత్రం సహించను అని ఊర్మిళ విమర్శకులకు వార్నింగ్ ఇచ్చారు. 

అలాగే భారత జనతా పార్టీ పై కూడా ఊర్మిళ ఊహించని విధంగా విమర్శలు వదిలారు. బీజేపీ యువతను మోసం చేసిందని మళ్ళీ అదే మాయమాటలు చెబుతున్నారని అన్నారు. తప్పకుండా తాను ఎన్నికల్లో గెలుస్తానని చెప్పిన ఊర్మిళ సినిమా ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు. అంధేరిలో జరిగిన ఈ ప్రచారంలో పాటిదార్‌ ఉద్యమ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ కూడా పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios