Asianet News TeluguAsianet News Telugu

‘వినయ విధేయ రామ’నుంచి ఆ అతి సీన్ లేపేసారు

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ డైరక్టర్ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో తెలుగు సినిమా ఊహించనంత హీరోయిజం కనిపిస్తుంటుంది. 

Train sequence deleted from Vinaya Vidheya Rama
Author
Hyderabad, First Published Jan 13, 2019, 9:34 AM IST

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ డైరక్టర్ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో తెలుగు సినిమా ఊహించనంత హీరోయిజం కనిపిస్తుంటుంది.  హీరోని ఇష్టపడి, వారి అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన.

అందుకే అవన్నీ కమర్షియల్ పరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. అయితే బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ చూపించిన విధానం నవ్వులు పాలు చేసింది. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమాలో చాలా సన్నివేశాలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

రామ్ చరణ్ కదిలే ట్రైన్ మీదికి  పై నుంచి దూకి  మరీ నిమిషాల్లో గుజరాత్ నుండి బీహార్ వచ్చేయడం.. విలన్స్ తల నరికితే వారి తలలు ఆకాశంలోకి ఎగిరపోవడం.. అక్కడే ఉన్న గ్రద్ధలు ఆ తలలను ఎత్తుకుపోవడం.. ఇండియన్ ఆర్మీకి సాధ్యం కాని పనిని రామ్ చరణ్‌ ఒక్కడే చేసి మూడొందల మందిని చంపేయడం.. విషంతో ఉన్న పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం లాంటి వాస్తవాలకు దూరంగా ఉన్న సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. 

అయితే ఇవన్నీ రివ్యూలలో ఎత్తి చూపటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరిగింది. అవి దర్శక,నిర్మాతలు దాకా చేరాయి.  దాంతో  ఈ సినిమా లో తొలిగిస్తున్నారు. మొదటగా ట్రైన్ పై కి దూకే సీన్ ని ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు తొలిగిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు నుంచి సినిమా చూసే వారికి ఆ సీన్  కనపడదు.

సంబంధిత వార్తలు..

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

 

 

Follow Us:
Download App:
  • android
  • ios