Asianet News TeluguAsianet News Telugu

సైరా: డైరెక్టర్ ఎంపికలో రాంచరణ్ సక్సెస్.. సురేందర్ రెడ్డి చింపేశాడు!

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. 

surender reddy gets applause for Sye Raa movie
Author
Hyderabad, First Published Oct 2, 2019, 2:22 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా సైరా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ముంబైలో కూడా మీడియా కోసం ఓ షో ప్రదర్శించారు. సైరా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. సినీ క్రిటిక్స్ కూడా సైరా బావుందంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అభిమానుల హంగామా ఒకరేంజ్ లో ఉంది. 

ఇదిలా ఉండగా దర్శకుడు సురేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కిక్, రేసు గుర్రం లాంటి ఫన్ టచ్ ఉండే చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి.. సైరా లాంటి భారీ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడం.. కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కాగా జోడించడంతో ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. 

కొన్ని సన్నివేశాల్లో సురేందర్ రెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేశారని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. సైరా చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంపిక చేసింది రాంచరణ్. దీనితో రాంచరణ్ నిర్ణయంపై కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ, భారీ తారాగణాన్ని సురేందర్ రెడ్డి అద్భుతంగా హ్యాండిల్ చేశారు. 

ఇలాంటి హిస్టారికల్ మూవీస్ తెరక్కించాలంటే మనకు రాజమౌళి మాత్రమే కనిపించేవారు. ఆ జాబితాలోకి సురేందర్ రెడ్డి కూడా చేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios