Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ వి ఒక్కటీ వదలకుండా అన్నీ చూసేసిందట

  • హాబుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో
  • సాహోలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్
  • సెట్స్ లో ప్రభాస్ ను ద న్యూ బ్లాక్ బస్టర్ స్టార్ అంటూ పొగిడేస్తున్న శ్రద్ధ
shraddha kapoor watches all prabhas movies

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహోలో హిరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ వచ్చి సాహో షూటింగ్ లో పాల్గొంటున్న శ్రద్ధ.. రీసెంట్ గా మన తెలుగు వంటకాలతో ప్రభాస్ ఇచ్చిన విందును తెగ ఎంజాయ్ చేసింది. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో నలుగురితో పంచుకుంది కూడా. ఈ భామ ప్రభాస్ కు బాగా కనెక్ట్ అయిందని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

 

ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్‌’ నుంచి ‘మిర్చి’ వరకు... టోటల్‌గా పదహారు సినిమాలు... ఒక్క సినిమాను కూడా శ్రద్ధా కపూర్‌ వదల్లేదట! ప్రభాస్‌ సిన్మాలన్నీ చూసేసిందట. ఎప్పుడో తెలుసా? ‘సాహో’కి సంతకం చేసిన తర్వాత. ‘సాహో’ షూటింగులో ఎంటరవ్వడానికి ముందే అన్నీ చూసేసిందట! హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో ఒక్కో సినిమా గురించి శ్రద్ధా చెబుతుంటే... ప్రభాస్‌తో పాటు ‘సాహో’ టీమ్‌ సభ్యులు అంతా థ్రిల్ ఫీలయ్యారట.



ప్రభాస్‌ సిన్మాలన్నీ మీరెప్పుడు చూశారు? అనడిగితే... ‘‘ప్రభాస్‌ నటన గురించి పూర్తిగా తెలియాలంటే అతని సిన్మాలన్నీ చూడాలి కదా! నేను అదే పని చేశా’’ అని శ్రద్ధా చెప్పిందట! ఆమె కమిట్‌మెంట్‌కి అందరూ క్లాప్స్‌ కొట్టారట. అంతే కాదు.. ప్రభాస్‌కి ఓ కొత్త టైటిల్‌ కూడా ఇచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ. సాధారణంగా ప్రభాస్‌ని ‘డార్లింగ్, యంగ్‌ రెబల్‌స్టార్‌’ అని ఫ్యాన్స్‌ పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా శ్రద్ధా  ప్రభాస్ ను ‘ద న్యూ బ్లాక్‌బస్టర్‌ కింగ్‌’ అని అంటోంది. అంతా ‘బాహుబలి’ ఎఫెక్ట్‌.

Follow Us:
Download App:
  • android
  • ios