Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ హీరోకి చిలిపి కోరిక.. ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలని ఉందట.. కానీ!

బాలీవడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఎవర్గ్రీన్ యంగ్ లుక్ లో కనిపిస్తుంటాడు. ఈ స్టైలిష్ హీరోకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. షాహిద్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Shahid Kapoor wanted to watch Scarlett Johansson taking a shower
Author
Hyderabad, First Published May 10, 2019, 8:07 PM IST

బాలీవడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఎవర్గ్రీన్ యంగ్ లుక్ లో కనిపిస్తుంటాడు. ఈ స్టైలిష్ హీరోకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. షాహిద్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు వర్షన్ తెరకెక్కించిన సందీప్ వంగానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. తాజాగా షాహిద్ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. 

ఇటీవల సినిమా అభిమానులంతా అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు అదరగొడుతోంది. అవెంజర్స్ లోని థానోస్, ఐరన్ మాన్, థోర్ లాంటి కీలక పాత్రలు అందరిని ఆకర్షించాయి. బ్లాక్ విడో పాత్రలో నటించిన స్కార్లెట్ జాన్సన్ కూడా అందరిని ఆకట్టుకుంది. గతంలో షాహిద్ కపూర్ ఈ హాలీవుడ్ నటి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

షాహిద్ కపూర్ స్కార్లెట్ జాన్సన్ ని పిచ్చిగా అభిమానిస్తాడట. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ షాహిద్ కపూర్ ని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఒక వేళ మీకు చూపు లేకపోతే ఏ అమ్మాయి స్నానం చేస్తుంటే చూడాలనుకుంటారు అని అడిగాడు. చూపు లేకపోతే ఎలాగు కనిపించదు. అయినా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని యాంకర్ పట్టుబట్టాడు. షాహిద్ కపూర్ నవ్వుకుంటూ స్కార్లెట్ జాన్సన్ అని సమాధానం ఇచ్చాడు. 

స్కార్లెట్ జాన్సన్ చాలా హాట్ గా ఉంటుంది అని షాహిద్ కపూర్ తెలిపాడు. నాకు చూపే లేనపుడు అమ్మాయి స్నానం చేస్తుంటే ఎందుకు చూడాలని అనుకుంటాను అని షాహిద్ తెలిపాడు. కరణ్ జోహార్ తో జరిగిన మరో ఇంటర్వ్యూలో కూడా షాహిద్ కపూర్ స్కార్లెట్ జాన్సన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios