Asianet News TeluguAsianet News Telugu

శతృఘ్న సిన్హా వ్యాఖ్యలతో మళ్లీ పద్మావతి మంటలు

  • రోజు రోజుకు ముదురుతున్న పద్మావతి వివాదం
  • తాజాగా పద్మావతికి వ్యతిరేకంగా శతృజ్ఞ సిన్హా వ్యాఖ్యలు
  • పద్మావతిని అభ్యంతరాలు చెప్తున్న వారికి చూపాకే రిలీజ్ చేయాలంటున్న శతృ
satrughan sinha opposes padmavathi release

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునె ప్రధాన పాత్రలో తెరకెక్కిన  ‘పద్మావతి’ సినిమా డిసెంబర్ 1న విడుదల కావాల్సి వున్నా వివాదాలు చుట్టు ముట్టడంతో... రిలీజ్ మరింత జఠిలమవుతోంది. పార్లమెంటరీ ప్యానెల్ దగ్గరికి వెళ్లాక ఈ వివాదానికి ఒక పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటే.. అక్కడా భన్సాలీపై పై ముప్పేట దాడి జరిగింది. మీడియాకు ముందే ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ పెట్టడంపై సెన్సార్ బోర్డు అతడిపై తీవ్రంగా మండిపడింది. అక్కడ వివాదం ఓ కొలిక్కి రాలేదు.

 

మరోవైపు నెమ్మదిగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బన్సాలీకి మద్దతు తగ్గిపోతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతమవుతున్న నేపథ్యంలో... పద్మావతికి మద్దతిస్తే తమ సినిమాలకు ఇబ్బంది వస్తుందని ఇండస్ట్రీ ప్రముఖులు సైలెంటుగా ఉంటున్నారు. రోజుకో వివాదం పద్మావతిని చుట్టు ముడుతుంటే తాజాగా సీనియర్ నటుడు, భాజపా ఎంపీ ‘పద్మావతి’ మంటల్ని మరింత పెంచే ప్రయత్నం చేశాడు. ఎంతైనా సినీ పరిశ్రమకు చెందిన వాడే కాబట్టి ఈ సినిమాకు అనుకూలంగా మాట్లాడతాడని అనుకుంటే.. వివాదాన్ని మరింత పెంచే వ్యాఖ్యలు చేశాడు శత్రుఘ్న. ‘పద్మావతి’కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్ణిసేన ప్రతినిధులతో సన్మానం చేయించుకున్న శత్రుఘ్న.. ఈ చిత్రాన్ని ముందు మీడియాకు ఎందుకు చూపించారని మండిపడ్డారు. 

 

ముందు కర్ణిసేనకు.. రాజ్ పుత్‌లకు చూపించాలని.. వాళ్లు అభ్యంతరాలు చెప్పే సన్నివేశాలన్నీ తొలగించాలని.. వాళ్ల మనోభావాల్ని దెబ్బ తీసేలా సినిమా ఉంటే ప్రదర్శనకు అంగీకరించేది లేదని వ్యాఖ్యానించారు. ఈ గొడవ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సమాచార ప్రసార శాఖా మంత్రి స్మృతి ఇరానీ మౌనం వీడాలని ఆయన కోరారు. ఇండస్ట్రీకి చెందిన వాడే.. ‘పద్మావతి’ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై బాలీవుడ్ జనాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios