Asianet News TeluguAsianet News Telugu

రైల్వే క్లర్క్ గా సమంత.. చైతు కోసం స్పెషల్ గా..!

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా ప్రస్తుతం నాగా చైతన్య - సమంత జంట అందరిని ఆకర్షిస్తోంది. నిన్నా మొన్న ప్రేమ పక్షుల్లా విహారం చేసిన ఈ జోడి కనురెప్ప పాటులో పెళ్లి చేసుకున్నట్టు ఉంది. 

samantha naga chaithanya upcoming film
Author
Hyderabad, First Published Nov 20, 2018, 8:28 PM IST

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా ప్రస్తుతం నాగా చైతన్య - సమంత జంట అందరిని ఆకర్షిస్తోంది. నిన్నా మొన్న ప్రేమ పక్షుల్లా విహారం చేసిన ఈ జోడి కనురెప్ప పాటులో పెళ్లి చేసుకున్నట్టు ఉంది. పైగా పెళ్లి జరిగి ఏడాది కావొస్తోంది. టైమ్ నిజంగా చాలా స్పీడ్ గా కొనసాగుతోంది. 

అసలు విషయంలోకి వస్తే.. నాగచైతన్య - సమంత పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం మజిలీ. నిన్నుకోరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నం లోని సింహాచలం రైల్వే స్టేషన్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సమంత ఇందులో రైల్వే బుకింగ్ క్లర్క్ పాత్రలో కనిపించనుందట. 

చాలా సింపుల్ అండ్ హోమ్లీగా కనిపించే పాత్ర అని తెలుస్తోంది. చైతు కోసం ఎక్కువగా ఆరాటపడే అమ్మాయిగా కనిపించనుందని టాక్. ఇక సినిమా కోసం సమంత స్పెషల్ కేరింగ్ తీసుకుంటోంది. ఎందుకంటే నాగచైతన్య వరుస డిజాస్టర్స్ అందుకోవడంతో ఈ సినిమాతో హిట్టివ్వాలని ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చిత్ర యూనిట్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి భర్తకు అమ్మడు ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios