Asianet News TeluguAsianet News Telugu

రోజూ తినకున్నా ఫర్లేదు కానీ సెక్స్ లేకుండా బతకడం కష్టం-సమంత

  • అక్కినేని వారింట అడుగుపెట్టబోతున్న సమంత 
  • అక్టోబర్ 6న నాగచైతన్యతో సమంత వివాహం
  • పెళ్లి ఫిక్సయ్యాక బోల్డ్ గా తయారైన సమంత
samantha bold statement on having sex

అక్కినేని వారింటి కోడలు కాబోతున్న ఉత్సాహంలో ఉన్న సమంత పెళ్లి దగ్గర పడుతున్నా కొద్ది మరింత బోల్డ్ గా తయారవుతుంది. నాగ చైతన్యతో అక్టోబర్ 6న పెళ్లి జరుపుకోనున్న సమంత ఈలోపే తను కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులన్నిటిని ఫినిష్ చేసేస్తోంది. ఇక ఈమధ్యనే జె.ఎఫ్.డబ్ల్యుూ మేగజైన్ కోసం సమంత ఇచ్చిన హాట్ ఫోటో షూట్ కోసం ఎంత తీసుకుందో గానీ.. ఆ ఫోటోలు కుర్రకారుకు కిక్కెక్కించాయి. అలా హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన సమంత మేగజిన్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు కూడా అంతకంటే బోల్డ్ గా సమాధానం చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులిస్తోంది.

 

 

తనకిష్టమైన ఐదు ఎప్పుడూ తన వెంటే హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని చెప్పిన సమంత ఓ అభిమాని ఫుడ్ ఆర్ సెక్స్ అన్న ప్రశ్నకు సమాధానం అందరు ఆశ్చర్యపడేలా ఇచ్చింది. ఓ రోజు తినకుండైనా ఉండొచ్చు కాని ఆ ఆకలి మాత్రం రోజు తీర్చుకోవాల్సిందే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. గతంలో పద్ధతిగా కనిపించిన అమ్మడు ఇప్పుడు మరింత రెచ్చిపోతూ.. ఎలాంటి విషయాన్నైనా సరే బోల్డ్ గానే తీసుకుంటూ అందరికీ షాకులిస్తోంది. ఇక పెళ్లి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాలు మాత్రం తప్పక చేస్తా అంటుంది సమంత. అంతేకాదు నచ్చిన అంశాల గురించే కాదు చైతులో నచ్చని అంశం ఒక్కటి లేదని చెప్పింది సమంత.

 

 

సినిమాలు ఓకే కాని పెళ్లి తర్వాత ఇలాంటి ప్రవర్తనే కంటిన్యూ చేస్తే మాత్రం కష్టమే అంటున్నారు అక్కినేని అభిమానులు. కొద్దికాలంగా చైతన్యతో ప్రేమాయణం సాగించిన సమంత పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ ఇయర్ మొదట్లో నెగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట అక్టోబర్ లో ఒకటి అవబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios