Asianet News TeluguAsianet News Telugu

త్రిష పాత్రలో సమంత..? ఇదిగో క్లారిటీ!

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

samantha about 96 movie telugu remake
Author
Hyderabad, First Published Oct 18, 2018, 2:44 PM IST

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం '96' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే సినిమా సక్సెస్ అందుకుంది.

అయితే ఈ సినిమాని రిలీజ్ కి ముందే చూసిన దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే త్రిష పాత్రలో సమంత కనిపిస్తుందని, హీరోగా నాని నటిస్తాడని వార్తలు ఊపందుకున్నాయి.

ఈ విషయంపై చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన లేదు. తాజాగా ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా సమంతను ఇదే విషయంపై ప్రశ్నించాడు. '96' తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా మీరు నటిస్తున్నారని విన్నాం.. నిజమేనా..? అని సామ్ ని ప్రశ్నించగా దానికి ఆమె.. 'దాన్ని మళ్లీ తెరకెక్కించకూడదు' అంటూ బదులిచ్చింది. దీంతో ఆమె ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios