Asianet News TeluguAsianet News Telugu

RX100 హీరో హిప్పీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'హిప్పీ`.  ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

RX100 hero hippi release date
Author
Hyderabad, First Published Apr 17, 2019, 2:39 PM IST

ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'హిప్పీ`.  ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

జూన్ 7న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``మా `హిప్పీ` జూన్ 7న విడుద‌ల కానుంది. షూటింగ్ చాలా బాగా జ‌రిగింది. ఔట్‌పుట్ అనుకున్న‌దానికన్నా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం.  పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన‌ర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్‌ స్టోరి ఉంటుంది. మ‌రో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేశారు ద‌ర్శ‌కుడు. 'కబాలి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను నిర్మించిన  కలైపులి ఎస్‌. థానుగారి సంస్థ‌లో `హిప్పీ` చేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నాను. ఆయ‌న ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పెద్ద బ‌డ్జెట్ చిత్రంలా చేశారు. సినిమా చేస్తున్న‌ప్పుడే పాజిటివ్ ఫీలింగ్‌తో చేశాం. జె.డి. చ‌క్ర‌వ‌ర్తిగారిది చాలా చాలా కీ రోల్‌. ఆయ‌న క‌థ విన‌గానే  ఒప్పుకోవ‌డంతో  హ్యాపీగా ఫీల‌య్యా. 

ఎందుకంటే  ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అంద‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది'' కార్తికేయ తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios