Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ రాజశేఖర్,ఎందుకంత రిస్క్?

సీనియర్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు చిరునామాగా ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన సినిమా పడలేదు. హీరోగా తప్పుకుని క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుదామనుకునే సమయానికి గ‌రుడ వేగ రూపంలో ఆయనకు హిట్ వచ్చింది. ఆ  చిత్రంతో ఫాంలోకి వచ్చిన రాజ‌శేఖ‌ర్..ఆ సక్సెస్ ని కొనసాగించాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఎలాంటి రిస్క్ చేయటానికైనా వెనకాడటం లేదని వినికిడి. 

Rajashekar injured while shooting
Author
Hyderabad, First Published Nov 18, 2018, 11:11 AM IST

ప్రస్తుతం రాజశేఖర్... అ! మూవీ ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే చిత్రం చేస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.  ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రెండు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో వేసిన‌ భారీ సెట్ లో రూపొందుతుంది. ఈ సెట్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్క్ చేసి మరి.. ఫైట్స్, జంప్స్ వంటి రిస్కీ షాట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

చిత్ర యూనిట్ వ‌ద్ద‌ని చెప్పి వారించినా వినకుండా  రియాలిటీ కోసం తానే ఆ స్టంట్స్ చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ చేస్తూండటం ప్రమాదంలో పడేసింది. రీసెంట్ గా ఓ  యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తుండగా భుజానికి గాయం అయిందట. అయినా గాయాన్ని లెక్క చేయ‌ని రాజశేఖర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తరువాత హాస్పిటల్ కు వెళ్లినట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ప్రతీది డూప్ లేకుండా తనే రిస్క్ చేస్తాననటంతో దర్శకుడు ఎలా చెప్పి వారించాలో అర్దం కావటం లేదంటున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో తెలుగుకు పరిచయం అయిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, వేరొకరు.. ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత‌. 

Follow Us:
Download App:
  • android
  • ios