Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం.

rajamouli speech at rrr movie press meet
Author
Hyderabad, First Published Mar 14, 2019, 11:58 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి సినిమాకు సంబంధించి చాలా విషయాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ''1897 లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. చదువుకోవడంతో పాటు ఆయన అన్ని విషయాల్లో చురుకుగా 
ఉండేవారు. యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు, మూడు సంవత్సరాలు ఆయన లేరు. తిరిగొచ్చిన తరువాత స్వాతంత్య్రం ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తరువాత బ్రిటీష్ చేతుల్లో చనిపోయారు. అలానే 1901 లో తెలంగాణాలో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త 
వయసులో ఇంటి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్లిన తరువాత ఆయన ఏం చేశారనేది ఎవరికీ తెలియదు. తరువాత తిరిగొచ్చి గిరిజనుల స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆయన కూడా బ్రిటీషర్ల చేతులో చనిపోయారు. ఇద్దరూ ఒకే టైం లో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడడం అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుందని'' అన్నారు.

''స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు,  ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే.. వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. నా సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ గా ఉంటుంది. భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 1920 లో జరిగే కథ కాబట్టి చాలా రీసెర్చ్ చేశామని'' చెప్పారు. 

''ఇలాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాకి సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉండాలి. అజయ్ దేవగన్ గారు సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆయనది. అలియా భట్.. చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. డైసీ ఎడ్గర్ జోన్స్.. తారక్ 
సరసన కనిపించనుంది. 'RRR' వర్కింగ్ టైటిల్ అనుకున్నాం.. అదే బావుందని అన్నారు. అన్ని భాషల్లో ఇది కామన్ గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుంది. నా సినిమాలో యంగర్ వెర్షన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్ కనిపించబోతున్నారు'' అంటూ చెప్పుకొచ్చారు. 

మా బంధానికి దిష్టి తగలకూడదు.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్

నాలుగు వందల కోట్లతో 'RRR'.. రిలీజ్ డేట్ ఇదే!


 

Follow Us:
Download App:
  • android
  • ios