Asianet News TeluguAsianet News Telugu

15 ఏళ్ల నుంచి రాజమౌళి వస్తూనే ఉన్నారు

టాలెంట్ ఎక్కడుందో పట్టుకుని,  వాళ్లను ఎంగేజ్ చేసుకోవటం రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ తరచుగా చేసే పని. వారి సక్సెస్ కూడా అక్కడే ఉంటుంది.తను డైరక్ట్ చేసే సినిమాలో ప్రతీ విభాగంలోనూ,  ప్రతీ విషయంలో తనదైన శైలిని చూపించాలనుకునే ఆయన టెక్నీషియన్స్ కోసం దేశం అంతటా గాలిస్తూంటారు. 

Rajamouli, Charan meet Aalim Hakim
Author
Hyderabad, First Published Nov 18, 2018, 11:06 AM IST

టాలెంట్ ఎక్కడుందో పట్టుకుని,  వాళ్లను ఎంగేజ్ చేసుకోవటం రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ తరచుగా చేసే పని. వారి సక్సెస్ కూడా అక్కడే ఉంటుంది.తను డైరక్ట్ చేసే సినిమాలో ప్రతీ విభాగంలోనూ,  ప్రతీ విషయంలో తనదైన శైలిని చూపించాలనుకునే ఆయన టెక్నీషియన్స్ కోసం దేశం అంతటా గాలిస్తూంటారు. ఎంత రెమ్యునేషన్ డిమాండ్ చేసినా ఇచ్చి తెచ్చుకుంటూంటారు. 

ఇప్పుడు తన తాజా చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం అదే చేస్తున్నారు. ఈ చిత్రానికి హైయిర్‌ స్టైలిస్ట్‌గా షారుక్‌ ఖాన్, ఆమిర్‌ఖాన్, హృతిక్‌ వంటి టాప్‌ స్టార్స్‌కు పని చేసిన ప్రముఖ బాలీవుడ్‌ హైయిర్‌స్టైలిస్ట్‌ ఆలీమ్‌ హకీమ్‌ని ఎంపిక చేసుకున్నారు రాజమౌళి. ఇప్పటికే ఆలిమ్‌తో ‘సై, బాహుబలి’ వంటి సినిమాలకు వర్క్‌ చేశారాయన. తాజా సినిమాలో హీరోల లుక్‌కి  సంబంధించి  హకీమ్‌తో డిస్కస్ చేసారు రాజమౌళి.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం హైదరాబాద్‌ వచ్చానని ఆలిమ్‌ హకీమ్‌ ట్వీట్‌ చేయటంతో అందరికీ ఈ విషయం రివీల్ అయ్యింది. చాలా రోజుల తర్వాత రాజమౌళిని కలవడం సంతోషంగా ఉందని ఆయన  అన్నారు. 

హకీమ్ తన ట్వీట్ లో ‘శనివారం హైదరాబాద్‌లో రాజమౌళి సర్‌, రామ్‌ చరణ్‌తో కలిసి చాలా ఎంజాయ్‌ చేశా. రాజమౌళిని 15 ఏళ్ల క్రితం తొలిసారి కలిశా. 2004లో ‘సై’ సినిమాలో నితిన్‌ హెయిర్‌స్టైల్‌ కోసం తొలిసారి ఆయన్ను కలిశా. అప్పుడు నా ఇంటికి అనుసంధానంగా ఉండే నా సెలూన్‌కు రాజమౌళి రావడం ఇంకా గుర్తుంది.

తర్వాత ‘బాహుబలి’కి.. ఇప్పుడు మరో సినిమాకు.. ప్రతిసారి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు రావాలని కొత్త ప్రయోగాలు చేసే దర్శకుడు ఆయన. ప్రతిసారి విజయం అందుకుంటూనే ఉన్నారు. భారత చలన చిత్ర పరిశ్రమకు రాజమౌళి గర్వకారణం. అలాంటి ఆయన సినిమా కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’ అని ఆలిమ్‌ హకీమ్‌ పేర్కొన్నారు. దీంతోపాటు రాజమౌళి, చరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి   దర్శకత్వంలో చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నదీ తెలియాల్సి ఉంది. ఈ చిత్రం 2020లో రిలీజ్‌ అవ్వనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios