Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ తో సమంత.. క్రేజీ కాంబినేషన్!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన సమంత దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. 

prabhas and samantha to team up?
Author
Hyderabad, First Published Apr 1, 2019, 1:00 PM IST

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన సమంత దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడా కవర్ చేసింది.

అయితే ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు కలిసి నటించలేదు. త్వరలోనే ఈ కాంబో సినిమా రానుందని సమాచారం. నిర్మాత దిల్ రాజు ఈ కాంబినేషన్ ని తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఓ కథ విన్న దిల్ రాజు అందులో ప్రభాస్ హీరోగా చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం  ఈ కథని డైరెక్ట్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. '96' సినిమా రీమేక్ కి సమంతని సంప్రదించిన సమయంలోనే దిల్ రాజు ఆమెతో మూడు ప్రాజెక్ట్ లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. 

అందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్, సమంతలను ఒకే తెరపై చూపించాలని భావిస్తున్నాడు. ప్రభాస్ గనుక ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తెరపై ఓ క్రేజీ కాంబినేషన్ ని చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios