Asianet News TeluguAsianet News Telugu

అడల్ట్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

తమిళ హీరోయిన్ ఓవియా సినిమాలతో కంటే బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. తనతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన ఆరవ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అలాంటిదేమీ లేదని చెప్పింది. 

Oviya's adult film 90 ML trailer is out..
Author
Hyderabad, First Published Feb 9, 2019, 4:03 PM IST

తమిళ హీరోయిన్ ఓవియా సినిమాలతో కంటే బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. తనతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన ఆరవ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అలాంటిదేమీ లేదని చెప్పింది.

యూత్ లో మాత్రం ఈమెకు చాలా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ '90ML' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. 'చూడండి.. పండు రుచి చూడబోతూ విత్తనం ఎలా ఉంటుందో నిర్నయించేయకండి. సినిమా విడుదలయ్యే వరకు ఆగండి. అప్పటివరకు ట్రైలర్ ఎంజాయ్ చేయండి' అంటూ పోస్ట్ పెట్టింది.

అయితే ఈ ట్రైలర్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఓవియా తోటి నటుడితో లిప్ లాక్ సీన్లలో నటించింది. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు కూడా ఉన్నాయి. ట్రైలర్ చూసిన నెటిజన్లు ఓవియాని ట్రోల్ చేస్తున్నారు.

'మీరు అడల్ట్ సినిమా చేయడం ఏంటి..?' అంటూ ఓవియాని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు 'మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు స్పూర్తిగా తీసుకుంటున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా' అంటూ ఓవియాపై మండిపడుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios