store bannerentertainment
By asianet news Telugu Team | 07:44 PM August 11, 2017
"లై" మూవీ రివ్యూ

Highlights

  • చిత్రం: లై(లవ్ ఇంటలిజెన్స్ ఎనిమీ)
  • న‌టీన‌టులు : నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ, మ‌ధుసూధ‌న్‌, రాజీవ్‌క‌న‌కాల‌, పూర్ణిమ త‌దిత‌రులు
  • సంగీతం : మ‌ణిశ‌ర్మ‌
  • నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌
  • క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : హ‌ను రాఘ‌వ‌పూడి
  • ఆసియానెట్ రేటింగ్-2.25/5

ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌, ఓ ఇంటెలిజెంట్ హీరో... వీరిద్ద‌రి మ‌ధ్య సాగే మైండ్ గేమ్‌. హాలీవుడ్‌  తరహా సినిమాలా సాగే చిత్రం 'లై'. 'అఆ' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత క‌థానాయ‌కుడు నితిన్, 'కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి చేసిన ఈ 'లై' కి విలన్ రోల్ ఫస్ట్ ఎలివేట్ అవటం, తర్వాత హీరో అంతకన్నా మరింతగా ఎలివేట్ అవటమే బ‌లం. మరి వీళ్లు చెప్పిన 'లై' ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.

క‌థ :

పేరులో స‌త్యం ఉన్నా.. ఇంటి పేరు ‘ఎ’ తో క‌లుపుకుని వాడుకలో అస‌త్యంగా త‌న‌ని తాను హైలెట్ చేసుకుంటుంటాడు ఎ.స‌త్యం (నితిన్‌). తండ్రిలేని స‌త్యంకి తొంద‌రగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాల‌న్న‌ది స‌త్యం త‌ల్లి కోరిక‌. అయితే స‌త్యం మాత్రం లైఫ్‌లో సెటిల్ అవ‌డం కోసం లాస్ వేగాస్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటాడు. కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య పిసినారి అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్‌)తో క‌లిసి లాస్ వేగాస్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది స‌త్యంకి. ఆ జ‌ర్నీలో ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ పుడుతుంది. ఈ మ‌ధ్య‌లో ఒక 'సూట్' కోసం పద్మ‌నాభం (అర్జున్‌) చేసే ప్లానింగ్స్ .. ఆ 'సూట్' తాలుకు ర‌హ‌స్యం చేధించ‌డానికి సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ బృందం చేసే ప్ర‌య‌త్నాలు న‌డుస్తుంటాయి. ఇంత‌కీ ఆ 'సూట్' వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? ఈ మిష‌న్‌లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? హీరో, విల‌న్ కి మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? అనేది తెర‌పైనే చూడాలి.

 

ఎలా వుందంటే :

ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాని సాధ్య‌మైనంత‌వ‌ర‌కు అంద‌రికి క‌నెక్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అందులో భాగంగానే ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌ని బ‌లంగా తీర్చిదిద్దాడు. హీరోయిన్ పాత్ర కి సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం లేక‌పోయినా.. ప్రారంభ స‌న్నివేశాల్లో ఆ పాత్ర నుంచి వినోదం పుట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే హీరో పాత్ర‌లో న‌వ‌ర‌సాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. క‌థానాయ‌కుడు పాత్రకి ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్‌ని, క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్‌ని జోడించి స్క్రీన్‌ప్లేని ఇంట్ర‌స్టింగ్‌గా న‌డిపే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే సినిమాలో కీల‌క‌మైన 'సూట్‌'కి సంబంధించిన ర‌హ‌స్యాన్ని చివ‌రి వ‌ర‌కు ఆస‌క్తిగా న‌డిపించాడు. ఇక ఆర్టిస్టుల నుంచి, టెక్నీషియ‌న్స్ నుంచి మంచి ఔట్‌పుట్‌ని రాబ‌ట్టుకున్నాడు. నిర్మాత పెట్టిన ఖ‌ర్చులోని ప్ర‌తి రూపాయిని తెర‌పై చూపించాడు. ఫైన‌ల్‌గా మైండ్‌గేమ్ జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి సినిమాని ఇచ్చే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి.

 

 

నటీనటులు :

నితిన్ అంటే గుర్తొచ్చేది ప్రేమ‌క‌థా చిత్రాలే. 'అఆ'తో కుటుంబ క‌థా చిత్రాల‌కు కూడా తాను స‌రిపోతాన‌ని నిరూపించుకున్నాడు. అయితే మ‌ధ్య‌లో చేసిన యాక్ష‌న్ చిత్రాలు అత‌ని కెరీర్‌ని బాగా దెబ్బ‌తీశాయి. అలాంటి యాక్ష‌న్ చిత్రాల‌లో మైండ్ గేమ్ త‌ర‌హా చిత్రాలూ ఉన్నాయి. ఈ 'లై' కూడా మైండ్ గేమ్ సినిమానే అయినా.. ఇది అత‌నిలోని న‌ట‌న బాగా ఎలివేట్ చేసింది. నితిన్ ప్రేమ‌క‌థా చిత్రాల‌కే కాదు, యాక్ష‌న్ చిత్రాల‌కూ న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అర్థ‌మౌతుంది సినిమా చూస్తుంటే. త‌న ప‌రిచ‌య స‌న్నివేశం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌రకు నితిన్ సినిమా కోసం ఎంత ఎఫ‌ర్ట్ పెట్టాడో స్ప‌ష్టంగా తెలుస్తుంది స్క్రీన్ మీద‌. 'అఆ' లో నితిన్‌ని చూసి.. ఇందులో నితిన్ ని చూస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. న‌ట‌న‌, డ్యాన్స్‌, ఫైట్స్‌, రొమాన్స్‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ప‌రిణితిని చూపించాడు. నితిన్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ గా 'లై'లోని పాత్ర‌ని చెప్పుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన చోట్ల ప‌వ‌న్‌ని రెఫ‌రెన్స్‌ని కూడా చ‌క్క‌గా వాడుకున్నాడు.. ఎప్ప‌టిలాగే. ఇక ఈ సినిమాలో నితిన్ త‌రువాత అర్జున్ పాత్ర‌కే ప్రాధాన్యం. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరైన అర్జున్‌.. ఈ సినిమాలో విల‌న్‌గా అద్భుతంగా న‌టించాడు. స్టైలీష్‌గా క‌నిపిస్తూనే తన బాడీ లాంగ్వేజ్‌తో సినిమాకి 'షోమాన్‌'గా నిలిచాడు. సినిమాకి ఒక‌ హైలెట్‌గా నిలిచాడు. ఇక కొత్త‌మ్మాయి మేఘా ఆకాష్‌కి న‌ట‌న‌కు అంత‌గా ప్రాధాన్యం లేని పాత్ర అయినా పిసినారి అమ్మాయి చైత్ర పాత్ర‌లో క్యూట్ గా క‌నిపించింది. కొన్ని చోట్ల తొలి రోజుల్లోని శ్రియ‌ని గుర్తుకి తెచ్చింది. నితిన్‌తో రొమాంటిక్ సీన్స్‌లో ఆక‌ట్టుకుంది. ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, అజ‌య్‌, శ్రీ‌రామ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధిమేర‌కు చ‌క్క‌గా న‌టించారు. నిన్న‌టి త‌రం హీరోయిన్ పూర్ణిమ హీరో త‌ల్లిగా ద‌ర్శ‌న‌మిస్తే.. రాజీవ్ క‌న‌కాల హీరోయిన్‌కి తండ్రిగా క‌నిపించాడు. ఇక ఇంద్ర‌కుమార్‌, నార‌ద శ‌ర్మ అంటూ కామెడీ కోసం అల్లిన పురాణ పాత్ర‌ల్లో పృథ్వీ, బ్ర‌హ్మాజీ న‌వ్వులు పంచారు. నితిన్ ఫ్రెండ్ పాత్ర‌లో మ‌ధునంద‌న్ మ‌రోసారి అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

 సాంకేతిక నిపుణులు :

త‌న తొలి రెండు చిత్రాల‌ను ప్రేమ‌క‌థ‌ల‌తో తీర్చిదిద్దిన హ‌ను రాఘ‌వ‌పూడి మూడో చిత్రాన్ని మైండ్ గేమ్ జోన‌ర్‌లో ఎంచుకోవ‌డం, దాన్ని బాగా ప్ర‌జంట్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశ‌మే. ప్రేమ‌క‌థ‌ల‌నే కాదు యాక్ష‌న్ చిత్రాల‌ను కూడా త‌ను బాగా డీల్ చేయ‌గ‌ల‌న‌ని హ‌ను ఫ్రూవ్ చేసుకున్నాడు. స్క్రీన్‌ప్లే విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకున్న హ‌ను.. మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న మార్క్ చూపించాడు. 'బ‌ల‌హీన‌త లేని బ‌ల‌వంతుడుని భ‌గ‌వంతుడు కూడా సృష్టించ‌లేదు', 'రాజు త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొదువా.. ఇంద్రుడు త‌ల‌చుకుంటే ఇబ్బందుల‌కు కొదువా', 'కోట్ల మంది సైనికులు స‌రిపోలేద‌ట‌.. పంచ‌పాండ‌వులు సాధించ‌లేద‌ట‌.. చివ‌రికి కృష్ణుడు ఒంట‌రి కాద‌ట‌.. అబ‌ద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తికాద‌ట‌.. అశ్వ‌త్థామ హ‌తః కుంజరః' వంటి డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. ఇక యువ‌రాజ్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి హైలెట్‌గా నిలిచిన అంశాల‌లో ఒక‌టి. బొంబాయి, శాన్‌ప్రాన్‌సిస్కో, జోర్డాన్‌, లాస్ వేగాస్‌.. ఇలా సినిమాలో లోకేష‌న్లు మారుతూనే ఉన్నా.. అత‌ని సినిమాటోగ్ర‌ఫీలో క్వాలిటీ ఎక్క‌డా మార‌లేదు. సంగీతం విష‌యానికి వ‌స్తే.. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న స్థాయిని చాటుకున్నాడు. పాట‌ల్లో 'మిస్ స‌న్‌షైన్‌, బంభ‌ట్ పోరి' అల‌రిస్తాయి. ఇక రీరికార్డింగ్ విష‌యంలో త‌న‌ను ఎందుకు కింగ్ అని పిలుస్తారో ఈ సినిమాతో మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పాడీ రీరికార్డింగ్ స్పెష‌లిస్ట్‌. ఇక 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ ఎంతో లావిష్‌గా ఉంది.

 

ప్ల‌స్ పాయింట్స్ :

నితిన్‌, అర్జున్ ల పర్ఫామెన్స్‌, హిరోహిరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం,  సంగీతం, సినిమాటోగ్రఫీ, స్టైలీష్ మేకింగ్‌, నిర్మాణ విలువ‌లు

 

మైన‌స్ పాయింట్స్‌ :

రొటీన్ రివెంజ్ డ్రామా

Show Full Article


Recommended


bottom right ad