Asianet News TeluguAsianet News Telugu

"నేనే రాజు నేనే మంత్రి" నా 50వ చిత్రం.. ఈ పుట్టినరోజు నాకిదే కానుక!

  • "నేనే రాజు నేనే మంత్రి" నా 50వ చిత్రం.. ఈ పుట్టినరోజుకు నాకిదే కానుక
  • తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు-కాజల్
  • నేనే రాజు నేనే మంత్రిలో రాధగా అలరిస్తానంటున్న కాజల్
nene raju nene manthri is my birthday gift this year says kajal

అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత కాజల్ సొంతం. కాజల్ కథానాయికగా పరిచయమై పదేళ్ళు పూర్తయ్యాయి. సరిగ్గా పదేళ్ళ తర్వాత తనను వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మరోమారు నటిస్తోంది కాజల్. రాణా కథానాయకుడిగా తేజ తెరకెక్కిస్తున్న పోలిటికల్ థ్రిల్లర్ "నేనే రాజు నేనే మంత్రి". కథానాయికగా కాజల్ నటిస్తున్న 50వ సినిమా ఇది. జూన్ 19న చిత్ర కథానాయకి కాజల్ పుట్టినరోజు సందర్భంగా "నేనే రాజు నేనే మంత్రి" సినిమా తనకు ఎందుకంత ప్రత్యేకమైన చిత్రమో కాజల్ తెలిపారు. 

 

"నేనే రాజు నేనే మంత్రి" చిత్రంలో నేను రాధ అనే పాత్ర పోషిస్తున్నాను. నన్ను :లక్ష్మీ కళ్యాణం"తో కథానాయికగా పరిచయం చేసిన తేజగారి దర్శకత్వంలో దాదాపు పదేళ్ళ తర్వాత నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. నేను ఇప్పటివరకూ పోషించని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. అలాగే.. రాణాతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుకొని పెర్ఫార్మ్ చేసేవాళ్లం. అన్నిటికంటే ముఖ్యంగా.. "నేనే రాజు నేనే మంత్రి" నా 50వ చిత్రం కావడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం. నా పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అంటూ "నేనే రాజు నేనే మంత్రి" సినిమా గురించి కాజల్ తన అనుభవాలను పంచుకొన్నారు. 

 

రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

 

సంస్థ‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సంగీతం:  అనూప్ రూబెన్స్‌, ఛాయాగ్ర‌హణం:  వెంక‌ట్ సి.దిలీప్‌, కూర్పు:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, క‌ళ‌:  నారాయ‌ణ రెడ్డి, పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ , నిర్మాత‌లు:  సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్స్:  అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌, స‌మ‌ర్ప‌ణ‌:  డి. రామానాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  తేజ‌ 

Follow Us:
Download App:
  • android
  • ios