Asianet News TeluguAsianet News Telugu

జెర్సీ కోసం రెమ్యునరేషన్ త్యాగం చేస్తోన్న నాని..ఎందుకంటే?

న్యాచురల్ స్టార్ నాని సినిమాలంటే పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుందనేది ఆడియెన్స్ ఆలోచన. నాని తన కెరీర్ లో కామెడీ టైమింగ్ తోనే ఎక్కువగా ఆకట్టుకున్నాడు. 

nani remuneration news viral
Author
Hyderabad, First Published Oct 29, 2018, 4:39 PM IST

న్యాచురల్ స్టార్ నాని సినిమాలంటే పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుందనేది ఆడియెన్స్ ఆలోచన. నాని తన కెరీర్ లో కామెడీ టైమింగ్ తోనే ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక లవ్ ఎమోషన్ ని కూడా నిన్ను కోరి సినిమాలో చూపించి ఆ రూట్ ని కూడా ఆడియెన్స్ కి టచ్ చేశాడు. 

ఇకపోతే త్వరలో క్రికెటర్ గా కనిపించి డిఫరెంట్ హిట్టందుకోవాలని అనుకుంటున్నాడు. మళ్ళి రావా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ నాని జెర్సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ముందు నుంచి నాని ఎంతో ఆసక్తిని చూపుతున్నాడు. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి చిత్ర యూనిట్ మంచి క్వాలిటీ కోసం తెగ కష్టపడుతోంది. 

ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యమిస్తున్నారట. ఇకపోతే సినిమా గ్రాఫిక్స్ కి ఖర్చు ఎక్కువవుతుండడంతో డబ్బు అడ్జస్ట్ చేయలేక నిర్మాత కొంత ఇబ్బంది పడుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే విధంగా నాని పరిస్థితిని గమనించి రెమ్యునరేషన్ ను ప్రస్తుతం త్యాగం చేశాడని సమాచారం. 

సినిమా రిజల్ట్ తరువాత ఆ లెక్కలుచూసుకోవచ్చని ముందు సినిమా క్వాలిటీ ఇంపార్టెంట్ అంటూ అది ఆలస్యం కాకూడదని మంచి నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే మరికొన్ని వార్తలను గమనిస్తే ఒక ఏరియా షేర్స్ ను నానికి కేటాయించినందుకే పారితోషికం తీసుకోలేదని సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు గాని నాని మాత్రం జెర్సీ సినిమా కోసం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios