Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ కోసం డబ్బులిచ్చిన నాని..!

సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న ప్రాజెక్ట్ మరొకరితో చేయడం చూస్తూనే ఉన్నాం. దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా నిర్మాత అశ్వనీదత్ తో చేయాల్సిన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తున్నారు. 

nani paid back on behalf of director
Author
Hyderabad, First Published Mar 1, 2019, 3:37 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న ప్రాజెక్ట్ మరొకరితో చేయడం చూస్తూనే ఉన్నాం. దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా నిర్మాత అశ్వనీదత్ తో చేయాల్సిన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తున్నారు. దీంతో అది కాస్త ఇష్యూ అయినట్లు తెలుస్తోంది. అయితే విషయం బయటకి రానివ్వకుండా ఫిలిం ఛాంబర్ లోనే సెటిల్ చేసుకున్నట్లు సమాచారం.

విక్రమ్ తన తదుపరి సినిమా అశ్వనీదత్ బ్యానర్ లో చేయడానికి అంగీకరించి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నాడు. నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు.

దీంతో అశ్వనీదత్ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేయడంతో తీసుకున్న అడ్వాన్స్ మొత్తం దాదాపు కోటిన్నర రూపాయలను తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తాన్ని విక్రమ్ తో పాటు నాని, మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా భరించారని సమాచారం. నాని కారణంగానే విక్రమ్ మైత్రి మూవీ మేకర్స్ తో పని చేస్తున్నాడు.

ప్రస్తుతం విక్రమ్ అంత మొత్తాన్ని తిరిగిచ్చే పొజిషన్ లో లేకపోవడం నాని, మైత్రి మూవీ మేకర్స్ వారు షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన డైరెక్టర్ కోసం నాని సొంతంగా డబ్బులివ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios