Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్: ఆ పాత్రను రిజెక్ట్ చేసిన మెగా బ్రదర్.. తమ్ముడి కోసమేనా?

నందమూరి బాలకృష్ణ ఒక సినిమా మొదలుపెట్టారంటే సినిమాకు సంబందించిన షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి కృషి చేస్తారు. సాధారణ సినిమాలకే విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే బాలయ్య తన తండ్రి బయోపిక్ కి పనిచేస్తుంటే ఇంకేంత స్పీడ్ గా పని చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 

naga babu rejected krish offer
Author
Hyderabad, First Published Nov 20, 2018, 9:06 PM IST

నందమూరి బాలకృష్ణ ఒక సినిమా మొదలుపెట్టారంటే సినిమాకు సంబందించిన షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి కృషి చేస్తారు. సాధారణ సినిమాలకే విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే బాలయ్య తన తండ్రి బయోపిక్ కి పనిచేస్తుంటే ఇంకేంత స్పీడ్ గా పని చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అందరూ అనుకున్నట్టుగానే బాలకృష్ణ షూటింగ్ లో వేగాన్ని పెంచారు. 

అయితే రీసెంట్ గా ఒక పాత్ర కోసం దర్శకుడు క్రిష్ మెగా బ్రదర్ నాగబాబు ను కలిశారట. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎస్వీఆర్ తో నటించిన గోల్డెన్ హిట్స్ చాలా ఉన్నాయి. అయితే ఎస్వీఆర్ పాత్ర కోసం నాగబాబును సంప్రదించగా వేరే కారణాల వల్ల ఆయన ఒప్పుకోలేదట. ఎన్నికల సమయంలో వస్తోన్న చిత్రం కావున టీడీపీ ఆనవాళ్లు సినిమాలో ఉంటాయి. అదే విధంగా ఆ కాంపౌండ్ టచ్ చేస్తే భిన్నాభిప్రాయాలు వెలువడతాయనే అనుమానంతో తమ్ముడి కోసమే రిజెక్ట్ చేశాడనే టాక్ వస్తోంది.  

ఆ సంగతి పక్కనపెడితే మహానటి సినిమాలో ఎస్వీఆర్ గా నటించిన మోహన్ బాబును తీసుకుందామని అనుకున్నా అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో కొత్తవారితోనే క్రిష్ ఎస్వీఆర్ పాత్రను చేయించినట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ కథానాయకుడు షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. సంక్రాంతికి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios