Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటుడిపై రేప్ కేసు నమోదు!

పలు సినిమాలలో, టీవీ షోలలో నటించిన అలోక్ నాథ్ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది. కానీ అతడిపై మీటూ ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. నిర్మాత వింటా నందా.. అలోక్ నాథ్ తనను అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

Mumbai Police file rape case against actor Alok Nath
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:18 PM IST

పలు సినిమాలలో, టీవీ షోలలో నటించిన అలోక్ నాథ్ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండేది. కానీ అతడిపై మీటూ ఆరోపణలు రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. నిర్మాత వింటా నందా.. అలోక్ నాథ్ తనను అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

ఆమె అలోక్ పై ఇటువంటి ఆరోపణలు చేసిన తరువాత చాలా మంది నటీమణులు అలోక్ నాథ్ తమని కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడనే విషయాలను బయటపెట్టారు. అలోక్‌ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది.

దీంతో అలోక్ నాథ్.. వింటా నందాపై పరువు నష్టం దావా కేసు వేశారు. అతడికి క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.1 ఇవ్వాలని అలోక్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అలోక్ కి మరో షాక్ తగిలింది.

నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్ పై రేప్ కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకి చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు.. 

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

Follow Us:
Download App:
  • android
  • ios