Asianet News TeluguAsianet News Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో మోహన్ బాబు పాత్రే హైలైట్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడిని ఎలా చూపిస్తారోననే భయం అభిమానుల్లో నెలకొంది. 

mohan babu role in varma's lakshmies ntr
Author
Hyderabad, First Published Feb 13, 2019, 12:53 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడిని ఎలా చూపిస్తారోననే భయం అభిమానుల్లో నెలకొంది.

రేపు ఈ సినిమా టీజర్ ని విడుదల చేయనున్నాడు వర్మ. ఇక 'మహానాయకుడు' సినిమాతో పాటు థియేటర్లలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ని స్క్రీన్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉండగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సినిమాలో కొన్ని పాత్రలను చూపించబోతున్నారు. వాటిలో మోహన్ బాబు పాత్ర కీలకమని తెలుస్తోంది.

ఎన్టీఆర్ చివరి రిజుల్లో మోహన్ బాబుతో బాగా టచ్ లో ఉండేవారట. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతితో కూడా మోహన్ బాబు బాగానే ఉండేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ మరణించారో లక్ష్మీపార్వతికి మోహన్ బాబుకి మధ్య గ్యాప్ వచ్చింది.

ఓ సందర్భంలో లక్ష్మీపార్వతి.. 'మోహన్ బాబు దుర్మార్గుడు' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అలా ఎందుకు అనాల్సి వచ్చిందనే విషయాలను ఈ సినిమాలో వివరంగా  చూపించబోతున్నారట. ఇదంతా చూస్తుంటే మోహన్ బాబు పాత్రని కూడా వర్మ నెగెటివ్ గా చూపించబోతున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios