Asianet News TeluguAsianet News Telugu

చిరుకు సిగ్గు ఎక్కువయ్యే కొంప మునిగిందా

  • వెండి తెరపై దశాబ్దాలుగా రఫ్పాడించేసిన మెగాస్టార్ చిరంజీవి
  • ఇటీవల ఖైదీ నెంబర్ 150తో సత్తా చాటిన చిరు
  • మా టీవీ మీలో ఎవరు కోటీశ్వరుడు తాజా సీజన్ లో హోస్ట్ గా చిరు
  • చిరుకు సిగ్గెక్కువై మీలో ఎవరు కోటీశ్వరుడు టీఆర్పీలు పడిపోయాయా
meelo evaru kotishwarudu megha star flop show

వెండి తెర మెగాస్టార్ గా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి బుల్లి తెరపై మాత్రం టాప్ రేటింగ్ స్టార్ గా నిలవలేకపోతున్నారు. బుల్లితెరపైకి ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన చిరంజీవికి చుక్కెదురైంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీఆర్పీల్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అనుకుంటే, సెలబ్రిటీలు హోస్ట్‌ చేసిన షోస్‌లో అతి తక్కువ టీఆర్పీలు వస్తోన్న షోగా రికార్డుకెక్కేలా వుంది. చిరంజీవి అభిమానులంతా సాయంత్రమైతే టీవీలకి అతుక్కుపోతారని అంచనాలుండేవి.

 

మెగా అబిమానులంతా మీలో ఎవరు కోటీశ్వరుడు షో వస్తోందంటే టీవీలకు అతుక్కుపోతారని భావించారు. కానీ కలలన్నీ కల్లలు చేస్తూ ఈ షోకి ఆడియన్స్‌ లేకుండా పోయారు. మెగాస్టార్‌ని ఎక్కడో ఒక రేంజ్‌లో ఊహించిన మాటీవీ యాజమాన్యానికి ఈషోకు వస్తున్న టీఆర్పీలు చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదట. గతంలో నాగార్జున నిర్వహించినప్పుడే బాగుండేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత జనంలో ఆయనకున్న క్రేజ్ కొంత ఎఫెక్టయిందనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 కొన్ని రికార్డులు బద్దలు కొట్టి కలెక్షన్లు సాధించినా... దాంట్లో చిరునుంచి ఎక్స్ పెక్ట్ చేసినంతగా ఫర్ఫామెన్స్ కనిపించలేదని అభిమానులే అభిప్రాయ పడ్డారు. పాటల్లో మెగా స్టార్ తనదైనశైలిలో స్టెప్స్ వేసేందుకు ప్రయత్నించినా... వయసు మీద పడ్డ ఛాయలు డాన్సుల్లో కనిపించాయి. ఇక సెంటిమెంట్ సీన్స్ లో నటన అదుర్స్ అనిపించినా... కొన్ని కామెడీ సీన్స్ లో.. సాధారణంగా కనిపించాల్సిన చోట్ల కొంచెం మెగా స్టయిల్ పక్కకు పోయి సిగ్గు ఎక్కువగా కనిపించిందని అభిమానులే అభిప్రాయపడ్డారు. దీనికి తోడు నేచురల్ గా కనిపించాల్సిన చిరు కాస్త కాకుండా మోతాదుకు మించి డ్రామా చేస్తున్నట్లు కూడా అనిపిస్తోందని అంటున్నారు.

 

అసలు మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచీ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని ఉత్కంఠగానే ఎదురు చూశారు. తాను బయటికి అలా కనిపించినా... మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫెయిల్‌ అయిందనేది చిరుకు మింగుడు పడని అంశం. ఇప్పటికే రాజకీయాల్లో అనుకున్న గోల్ రీచ్ కాలేక ఫెయిల్‌ అయిన చిరుకి బుల్లితెరపై అరంగేట్రం కూడా అనుకున్న క్రేజ్ తెచ్చిపెట్టలేదు.

 

ఈ షో ఇంతగా ఫ్లాప్‌ అవటానికి కారణం తను చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లేనని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. చిరు గతంలోలా కాకుండా కొత్తగా సిగ్గు పడటం ఎక్కువైందనీ, తన ప్రతి ఫ్రేములోనూ సిగ్గు పాలు ఎక్కువగా కనిపిస్తుండటంతోనే... మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు అనుకున్నంత ఆదరణ లభించట్లేదని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.