Asianet News TeluguAsianet News Telugu

మోహన్ బాబు కూతురని కూడా చూడరు.. మంచు లక్ష్మీ ఘాటు వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చిన్న నిర్మాతలు తమకు థియేటర్లు దొరకడం లేదు.. పెద్ద సినిమా వస్తే అసలు చిన్న సినిమాకు ఛాన్స్ ఇవ్వరని.. ఆ నలుగురి చేతుల్లోనే థియేటర్లు ఉంటాయని.. ఇండస్ట్రీలో థియేటర్ మాఫియా ఓ రేంజ్ లో జరుగుతోందని వాపోతున్నారు. 

manchu lakshmi on theatres mafia in cinema industry
Author
Hyderabad, First Published Mar 8, 2019, 11:36 AM IST

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చిన్న నిర్మాతలు తమకు థియేటర్లు దొరకడం లేదు.. పెద్ద సినిమా వస్తే అసలు చిన్న సినిమాకు ఛాన్స్ ఇవ్వరని.. ఆ నలుగురి చేతుల్లోనే థియేటర్లు ఉంటాయని.. ఇండస్ట్రీలో థియేటర్ మాఫియా ఓ రేంజ్ లో జరుగుతోందని వాపోతున్నారు. 

ఇప్పుడు నటి మంచు లక్ష్మీ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పటి స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి వచ్చిన మంచు లక్ష్మీ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాల్లో నటించింది.

తాజాగా ఆమె 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మీ.. ఇండస్ట్రీలో థియేటర్లన్నీ ఐదారుగురు చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. వాళ్లను అడిగేవారు లేరని.. కష్టపడి సినిమా తీస్తే.. దాన్ని థియేటర్ నుండి పీకేస్తున్నారని వాపోయింది. 

మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి వారం రోజులైనా థియేటర్ లో ఉంచుదామనే ఆలోచన కూడా చేయరని, అటువంటి మొహమాటాలు అసలు ఉండవని అన్నారు. తను నటించిన ఎన్నో మంచు సినిమాలను అకారణంగా థియేటర్ల నుండి తొలగించారని ఆరోపణలు చేసింది. ఐదారుగురు చేతుల్లో థియేటర్లన్నీ చిక్కుకుపోయాయని కామెంట్స్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios