Asianet News TeluguAsianet News Telugu

బాక్స్ ఆఫీస్: మహర్షి టార్గెట్ 100కోట్లు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ 25వ చిత్ర మహర్షి రిలీజ్ కు సిద్ధమైంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే మొదట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్  అంతంత మాత్రమే

maharshi pre release business
Author
Hyderabad, First Published May 6, 2019, 2:47 PM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ 25వ చిత్ర మహర్షి రిలీజ్ కు సిద్ధమైంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే మొదట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్  అంతంత మాత్రమే. అయితే ట్రైలర్ అనంతరం చిత్ర యూనిట్ మంచి ప్రమోషన్స్ తో అభిమానుల్లో అంచనాలను రేపింది. 

ఇక మహేష్ కెరీర్ లో మరో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల థ్రియేటికల్ వాల్యూతో బరిలోకి దిగనుంది. సినిమా ప్రీ రిలీజ్ మొత్తంగా 150 కోట్లు (శాటిలైట్ - డబ్బింగ్ రైట్స్ - డిజిటల్ ) దాటేసింది. మహేష్ కు పట్టున్న నైజాం ఏరియాలో మహర్షి సినిమా 24కోట్ల ధర పలుకగా నెల్లూరులో అతి తక్కువగా 2.9కోట్ల ధర పలికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 76కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మహర్షి కలెక్షన్స్ ఏ స్థాయిలో రాబడతాడో చూడాలి. 

ఫైనల్ గా 100 కోట్ల వరకు షేర్స్ రాబడితేనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలుస్తుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో సినిమాకు ఇది మంచి అవకాశం. పైగా పెద్ద సినిమాలు కూడా ఇప్పట్లో లేవు. గురువారం సినిమా రిలీజ్ అవుతుండడంతో మొదటి వారాంతరం సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios