Asianet News TeluguAsianet News Telugu

బాక్స్ ఆఫీస్: మహర్షి నైజం సిక్సర్.. బాహుబలి 2 రికార్డ్ మిస్

మహేష్ 25వ చిత్రం మహర్షి మొదటి రోజు అనుకున్నట్టుగానే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మహేష్ కి మంచి పట్టున్న ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేసాడు. మెయిన్ గా నైజం ఏరియాలో సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 

maharshi nizam collections
Author
Hyderabad, First Published May 10, 2019, 10:39 AM IST

మహేష్ 25వ చిత్రం మహర్షి మొదటి రోజు అనుకున్నట్టుగానే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మహేష్ కి మంచి పట్టున్న ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేసాడు. మెయిన్ గా నైజం ఏరియాలో సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. 

మొదటి రోజు 6.38 కోట్ల షేర్స్ ను అందుకొని టాలీవుడ్ లో బాహుబలి 2 తరువాత నైజాంలో డే-1 అత్యధిక షేర్స్ ను రాబట్టిన సినిమాగా మహర్షి నిలిచింది. మహేష్ భరత్ అనే నేను 4.48కోట్లు రాబట్టగా ఈ సినిమా అంతకంటే ఎక్కువ లాభాలను అందించడం విశేషం. అయితే మహేష్ కొట్టిన ఈ సిక్సర్ సరికొత్త రికార్డ్ అయినప్పటికీ బాహుబలి 2 రికార్డ్ ను కొద్దీ దూరంలో మిస్ అయ్యింది. 

బాహుబలి 2 నైజం ఏరియాలో మొదటి రోజు 8 కోట్ల షేర్స్ ను అందించింది. ఇంకా రెండు కోట్లు రాబట్టి ఉంటే మహేష్ కెరీర్ లో న్యూ రికార్డ్ నమోదయ్యేది. అయితే  నైజాంలో బాహుబలి 2 రికార్డ్ ను అందుకోవడం అంత ఈజీ కాదు. ఇంకా రెండు కోట్లు అంటే పాన్ ఇండియన్ రేంజ్ లో సినిమా రిలీజ్ అవ్వాలి. మరి ఆ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.  

నాన్ బాహుబలి రికార్డ్స్ తో మహర్షి హంగామా!

Follow Us:
Download App:
  • android
  • ios