Asianet News TeluguAsianet News Telugu

'మహర్షి' ఉగాది పోస్టర్.. స్టైలిష్ లుక్ లో మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

maharshi movie ugadi special poster
Author
Hyderabad, First Published Apr 5, 2019, 11:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమ్మర్ లో రాబోయే పెద్ద సినిమా ఇదే కావడంతో ట్రేడ్ వర్గాల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది.

మే 9న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటినుండే షురూ చేశారు. శనివారం నాడు ఉగాది పండగ సందర్భంగా రేపు ఉదయం 9 గంటల 09 నిమిషాలకు 'మహర్షి' టీజర్ ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పింది చిత్రబృందం. మహేష్ బాబు ఈ పోస్టర్ లో బ్లూ కలర్ సూట్ వేసుకొని, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కార్పోరేట్ స్టైల్ బిజినెస్ మెన్ గా మహేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios