Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్(3).. ఇక వర్మే చూపించాలి!

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయినా మిగిలిన ఆ కథను ఎంతవరకు కరెక్ట్ గా చూపిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతి ఎంట్రీ నుంచి కథ మొదలవుతుంది అని వర్మ ముందే క్లారిటీ ఇచ్చాడు. అయితే మహానాయకుడు సినిమాలో బసవతారకం మరణంతో కథ ఎండ్ అవుతుంది. 

mahanayakudu advantage for rgv
Author
Hyderabad, First Published Feb 22, 2019, 3:25 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు వచ్చేశాయి. అయితే బయోపిక్ అనే పదం ఈ సినిమాలకు వర్తించదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. బయోపిక్ అంటే ఒక జీవితాన్ని వెండితెరపై చూపించాలి. అన్ని అంశాలను చూపించడం కుదరకపోవచ్చు. కానీ ఒక మాటలో మిస్సయిన కథపై కనీసం వివరణ అయినా ఇవ్వాలి. బాలయ్య తీసిన బయోపిక్ లో అలాంటి అంశాలు ఉండవని ముందుగా అందరికి తెలిసిన విషయమే. 

అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయినా మిగిలిన ఆ కథను ఎంతవరకు కరెక్ట్ గా చూపిస్తాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతి ఎంట్రీ నుంచి కథ మొదలవుతుంది అని వర్మ ముందే క్లారిటీ ఇచ్చాడు. అయితే మహానాయకుడు సినిమాలో బసవతారకం మరణంతో కథ ఎండ్ అవుతుంది. 

ఎన్టీఆర్ రెండవసారి సీఎం అయిన తరువాతా అసలైన వైస్రాయ్.. వెన్నుపోటు అనే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కాంట్రవర్సీ కథను చూడాలని చాలా వరకు జనాల్లో ఆసక్తి ఉంది. అది వర్మకు కరెక్ట్ గా తెలుసు. అందుకే అక్కడి నుంచి కథను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక మహానాయకుడు ఆ విషయాలను టచ్ చేయకపోవడంతో వర్మ సినిమాకు మరింత కలిసొచ్చే అంశమే. 

ఎందుకంటే ఇక్కడ బాలయ్య ఆ పాయింట్స్ ను టచ్ చేయలేదు కాబట్టి ఓ విధంగా ఎన్టీఆర్ బయోపిక్ 3: లక్ష్మి పార్వతిలో చూడవచ్చని వర్మ గట్టిగా ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఆల్ రెడీ మొదలెట్టాడు కూడా. కాకపోతే ఇప్పుడు ఆ ప్రమోషన్స్ డోస్ ఇంకెక్కువ పెంచుతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఆ నిజాలను లక్ష్మి పార్వతి సైడ్ నుంచి అలోచించి ఆమెకు ఫెవర్ గా చూపిస్తారా? లేక వర్మ తాననుకునట్లు సొంతంగా కథను ప్రజెంట్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios