Asianet News TeluguAsianet News Telugu

'కాంచన 3'లో లారెన్స్ మాసివ్ పెర్ఫార్మన్స్..!

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా,స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీచిత్రం కాంచ‌న‌-3.

latest update on kanchana 3 movie
Author
Hyderabad, First Published Apr 12, 2019, 3:35 PM IST

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3.

రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ  సౌత్ ఇండియా లో   బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా
నిలవనుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U /A సర్టిఫికెట్ తో సెన్సార్ సభ్యులని  థ్రిల్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో  ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు.

ఈ సంద‌ర్బంగా బి.మధు  మాట్లాడుతూ.. ''ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫ్యాన్ అయిపోయారు. ఆ తరువాత వచ్చిన ప్రతి పార్టు కి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. లారెన్స్ తీసుకునే మంచి పాయింట్ కచ్చితంగా హార్ట్ టచింగ్ గా ఉండటం అందరిని ఆకట్టుకుంటుంది. ఇండియన్ హిస్టరీ లో 4 పార్ట్ లు తీసిన సినిమా ఇది ఒక్కటే. అలాగే ఇంకో 10 పార్ట్ లు తీస్తానని లారెన్స్ చెప్పటం విశేషం... ఇప్పుడు ఆయన నటించి దర్శకత్వం చేసిన  కాంచన 3 చిత్రం తన  కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220  రోజుల పాటు వర్క్ చేశారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న  తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు'' అని అన్నారు .

Follow Us:
Download App:
  • android
  • ios